ఇప్పుడు అమెరికాలో కొత్తగా వినిపిస్తున్న పేరు సరితా కోమటిరెడ్డి. ఈ తెలంగాణా బిడ్డ న్యూయార్క్ అటార్నీ జనరల్ పదవి రేసులో ముందంజలో వున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు ప్రకటించడంతో సరితా కోమటిరెడ్డి లైమ్ లైట్ లోకి వచ్చారు. భారతీయ సంతతికి చెందిన ఈ మహిళ వివరాలు తెలుసుకునేందుకు గూగుల్ తల్లి ఇంటి ముందు ఇండియన్స్ క్యూ కట్టారు. ఏఐ తలుపు తట్టి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకూ ఈ తెలుగు బిడ్డ ఎవరంటే….
1980లలో హైదరాబాద్ నుంచి నుంచి అమెరికా వలస వెళ్లిపోయింది సరితా కుటుంబం. తండ్రి హనుమంత రెడ్డి, తల్లి గీతా రెడ్డి ఇద్దరూ వైద్యులే. బ్రూక్లిన్ లో జన్మించిన సరిత మిస్సోరిలో పెరిగారు.
హార్వర్డ్ కాలేజీ అండ్ లా స్కూల్ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా తీసుకుంది. కొంతకాలం కొలంబియా లా కాలేజీలో ఆధ్యాపకురాలిగా పనిచేసారు.
ప్రస్తుతం ప్రతిష్టాత్మక హోల్డ్ మన్ వొగెల్ లా సంస్థతో కలిసి పనిచేస్తున్నారు. సరిత వయసు 41 ఏళ్ళు. ఆమెకు నలుగురు పిల్లలు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ఆగస్టు 15 వ తేదీన సరితను నామినేట్ చేయడం కాకతాళియం అని చెప్పాలి. ఈ పదవికి నామినేట్ అయిన తొలి తెలుగు వ్యక్తిగా రికార్డు సృష్టించారు.
ప్రస్తుతం న్యూయార్క్ అటార్నీ జనరల్ పదవికి పోటీ పడుతున్న సరితా కోమటిరెడ్డి తన ప్రచారంలో అమెరికా – భారత్ నేపథ్యం గురించి ప్రస్థావించడం చర్చనీయాంశంగా మారింది. నవంబర్ లో జరగనున్న ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన సరితా అధికార రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. డెమొక్రటిక్ అభ్యర్థి లెటిటియా జేమ్స్ తో తలపడుతున్నారు. గెలుపొటముల సంగతి ఎలా వున్నా ఈ పోటీతో ఆమె పేరు అంతర్జాతీయంగా మార్మోగుతోంది.
This post was last modified on August 20, 2026 8:28 am
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…