మన ప్రేక్షకులకు స్ట్రెయిట్ డబ్బింగ్ అనే భేదాలు ఉండవు కాబట్టి ఒరిజినల్ వెర్షన్లతో సమానంగా ఇక్కడా రిలీజ్ చేయడం మంచిదే. అయితే దానికో పద్దతి, ప్రణాళిక కావాలి. లేదంటే జనాలకు అవి వచ్చినట్టు తెలిసేలోపే మాయమైపోతాయి. సలార్ తో మనకు పరిచయమై వారణాసిలో విలన్ గా నటించడం ద్వారా మరింత దగ్గర కాబోతున్న మలయాళం స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ కొత్త మూవీ ‘ఖలీఫా’ మలయాళంలో ఇవాళ, తెలుగులో రేపు విడుదల కానుంది. ఈ పేరుతో ఒక మూవీ ఉందనే సంగతే పబ్లిక్ కి తెలియదు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పటిదాకా హైదరాబాద్ మొత్తం మీద ఖలీఫాకి రెండు భాషలు కలిపి ఓ ముప్పై దాకా షోలు ఇచ్చారు. విచిత్రంగా బుక్ మై షోలో మలయాళంవే ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే తెలుగు ఆడియన్స్ రిసీవ్ చేసుకోరనా లేక ఇంకేదైనా కారణం ఉందేమో తెలియదు. ఇదే పృథ్విరాజ్ గత నెల నో బడి అనే ఇంకో సినిమాతో వచ్చిన సంగతి తెలిసిందే. అది సూపర్ ఫ్లాప్. ఈ వారంలోనే ఓటిటి స్ట్రీమింగ్ జరగనుంది. అయినా బజ్ లేదు.
ఖలీఫాలో మోహన్ లాల్ కూడా ఒక క్యామియో చేశారు. దీని సంగతలా ఉంచితే ఈ మధ్య డబ్బింగ్ సినిమాలకు తెలుగులో మినిమమ్ పబ్లిసిటీ చేయడం లేదు. డిసికి ఒక్క ప్రమోషనల్ క్యాంపైన్ జరగలేదు. అయినా సరే కంటెంట్ నచ్చడంతో మనోళ్లు నెత్తిన బెట్టుకున్నారు. విశ్వనాథ్ అండ్ సన్స్ నిర్మించింది, తీసింది తెలుగు వాళ్ళు కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తీసుకున్నారు. ఒకప్పటిలా మేకర్స్ తెలుగు ప్రచారం మీద ప్రత్యేక దృష్టి పెట్టడం లేదు.
ఒకపక్క తెలంగాణలో టికెట్ రేట్ల గురించి డిస్కషన్ నడుస్తున్న టైంలో కొత్త సినిమాల నిర్మాతలు మరింత ప్లానింగ్ తో ఉండాలి. చెప్పిన డేట్ కి రిలీజ్ చేయడంతో బాధ్యత తీరిపోదు. దాన్ని జనాల్లోకి మరింత దగ్గరగా తీసుకెళ్తే ఫలితాలు బాగుంటాయి. రాజమౌళి, అనిల్ రావిపూడి లాంటి వాళ్ళ సక్సెస్ సూత్రాల్లో ఇదీ ఒకటి. అన్నట్టు ఈ ఖలీఫా కూడా గ్యాంగ్ స్టర్ డ్రామానే. బంగారం స్మగ్లింగ్ నేపథ్యంతో క్రైమ్ ప్రపంచంలో జరుగుతుంది. దర్శకుడు వైశాఖ్ మమ్ముట్టి, మోహన్ లాల్ తో చెప్పుకోదగ్గ సినిమాలే తీశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates