భర్త ఎవరితోనో సంబంధం పెట్టుకుంటాడు. భార్యకు అనుమానం వస్తుంది. విషయం రూఢి చేసుకుంటుంది. భర్తను జాగ్రత్తగా గమనిస్తూ.. పరాయి మహిళతో అతను కలిసి ఉన్నపుడు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటుంది. మొత్తం వ్యవహారాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలోకి వదలడం ద్వారా భర్త బాగోతాన్ని ప్రపంచానికి తెలిసేలా చేస్తుంది. అచ్చం ఇలాగే భర్తలు కూడా భార్యలను పట్టిస్తుంటారు.
సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. అందులో కొంత పేరున్న వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉంటే.. ఆ వీడియోలు మరింత విస్తృతం అవుతుంటాయి. ఇప్పుడు అలాంటి వీడియోనే ఒకటి తెలుగు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఫోక్ పాటల డ్యాన్సింగ్ వీడియోలతో పాపులర్ అయిన ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్.. ఎఫైర్‌తో సోషల్ మీడియాకు దొరికిపోయారు. వీడియో సాంగ్స్ కోసం కలిసి పని చేస్తున్న ఈ ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడిందని తెలుసుకున్న సాయి భార్య.. వాళ్లిద్దరూ ఒక గదిలో ఉండగా పట్టుకుంది.
ఇదేం పని అంటూ భర్తను నిలదీసిన ఆమె.. మాధురి మీద చేయి చేసుకుంది. తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఆమె భర్తను వెనకేసుకురావడం గమనార్హం. ఈశ్వర్ మంచి వాడే అని.. అతణ్ని మాధురి లోబరుచుకుందని.. తప్పంతా తనదే అని ఆమె మండిపడింది. తన భర్తకు తాగుడు అలవాటు కూడా లేదని.. అతను మంచోడే అయినా, అమ్మాయి మీద పడితే ఏం చేస్తాడంటూ ఆమె వ్యాఖ్యానించడం గమనార్హం.
ఆ అమ్మాయికి బ్రేకప్ అయితే తానే ఓదార్చానని, అలాంటి అమ్మాయి తన భర్తను వలలో వేసుకుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వీడియో వైరల్ అవడంతో ఈశ్వర్ సాయి, మాధురి కలిసి చేసిన పాటల వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవడం మొదలుపెట్టాయి. అందులో వారి కెమిస్ట్రీ చూసి రకరకాల కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.
Gulte Telugu Telugu Political and Movie News Updates