వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మొదటిసారి కలిసి చేస్తున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47’. దీని మీద మంచి అంచనాలు ఉన్నాయి. వెంకీకి ఫ్యామిలీ కథలు బాగా సెట్ అవుతాయి. త్రివిక్రమ్ కూడా అలాంటి కథలను తన స్టైల్‌లో బాగా హ్యాండిల్ చేయగలడు. అందుకే ఈ కాంబో అనగానే ప్రత్యేకంగా ఏదైనా చేస్తారనే ఆసక్తి వచ్చింది. కానీ ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ మాత్రం ఆ అంచనాలకు తగ్గ సౌండ్ చేయలేదనే చెప్పాలి.
టీమ్ ముందుగా వెంకటేష్ క్యారెక్టర్‌ను చిట్టిబాబుగా పరిచయం చేసింది. ఆ తర్వాత శ్రీనిధి శెట్టి సహా మిగతా పాత్రలను ఒక్కొక్కటిగా చూపించారు. వీడియోల్లో వెంకీ కామెడీ టైమింగ్, ఫ్యామిలీ సెటప్ గురించి చిన్న హింట్స్ ఉన్నాయి. చూసినప్పుడు బాగానే అనిపించాయి. కానీ రెండు మూడు రోజుల తర్వాత కూడా సోషల్ మీడియాలో మాట్లాడుకునేంత స్టఫ్ మాత్రం వాటిలో రాలేదు.
అదే టైమ్‌లో అనిల్ రావిపూడి చేస్తున్న వెంకటేష్ కళ్యాణ్ రామ్ సినిమా నుంచి వచ్చిన సరదా వీడియోలు మాత్రం వెంటనే క్లిక్ అయ్యాయి. అవి సినిమాలోని సీన్లు కూడా కావు. హీరోలు, హీరోయిన్లతో బయట చేసిన చిన్న ఫన్ వీడియోలే. అయినా సోషల్ మీడియాలో బాగా తిరిగాయి. సినిమా ఏంటి అనే దానికంటే ముందు కాంబినేషన్‌ను జనాల్లోకి తీసుకెళ్లడంలో ఆ టీమ్ సక్సెస్ అయింది.
‘ఆదర్శ కుటుంబం’ విషయంలో మాత్రం త్రివిక్రమ్ ఇప్పటివరకు అలాంటి హడావుడి చేయడం లేదు. హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, ఇంట్లో వాళ్లు ఎలా ఉంటారు అనే పరిచయం వరకే ఆగిపోయారు. అసలు కథ ఏమిటి, వెంకీ త్రివిక్రమ్ కాంబోలో ప్రత్యేకంగా ఏముంది అనే హుక్ ఇంకా బయటకు రాలేదు. అందుకే మొదటి అప్డేట్స్ వచ్చినా ఎక్కువ రోజులు గుర్తుండకుండా పోయాయి.
అయితే దీన్నిబట్టి ప్రమోషనల్ కంటెంట్ మొత్తం క్లిక్ కాలేదని ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే పాటలు, పూర్తి టీజర్, ట్రైలర్ ఇంకా రావాల్సి ఉన్నాయి. త్రివిక్రమ్ కూడా మొదట క్యారెక్టర్లను పరిచయం చేసి, తర్వాత నెమ్మదిగా అసలు స్టఫ్ వదిలే ప్లాన్‌లో ఉండొచ్చు. కాంబినేషన్‌కు కావాల్సిన క్రేజ్ అయితే ముందే ఉంది. ఇప్పుడు దానికి సరిపోయే ఒక్క గట్టి వీడియో లేదా పాట పడాలి. అప్పటివరకు ‘ఆదర్శ కుటుంబం’ మీద అంచనాలు ఉన్నాయి కానీ, బయట సౌండ్ మాత్రం కాస్త తక్కువగానే ఉంది. మరి త్రివిక్రమ్ ఇదే సైలెంట్‌గా తీసుకెళ్తాడా.. లేక అసలు స్టఫ్‌తో ఒక్కసారిగా బజ్ పెంచుతాడా చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates