గత కొన్ని నెలలుగా తమిళ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ పెళ్లి గురించి జోరుగా ఊహాగానాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. సన్ నెట్ వర్క్ అధినేత కళానిధి మారన్ కూతురు, ఐపీఎల్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ ప్రేమలో ఉన్నట్లు, త్వరలో ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఐతే గతంలోనూ అనిరుధ్ పెళ్లి గురించి రూమర్లు రావడం, అవి నిజం కాకపోవడంతో కొత్త వార్తలను కూడా జనాలు సందేహంగానే చూశారు.
కానీ ఈసారి వచ్చింది రూమర్లు కాదని.. ఈ వార్తలు నిజమే అని తెలుస్తోంది. అనిరుధ్, కావ్యల పెళ్లికి డేట్‌తో పాటు వేదిక కూడా ఖరారైనట్లు ఇప్పుడు మీడియాలో, సోషల్ మీడియాలో గట్టి ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది నవంబరు 10న ఈ ఇద్దరూ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారట. అందుకు గ్రీస్ వేదికగా ఖరారైనట్లు సమాచారం. రెండు కుటుంబాలకు చెందిన ముఖ్యమైన సభ్యులు, సన్నిహితుల నడుమ అనిరుధ్, కావ్యల పెళ్లి జరగనున్నట్లు సమాచారం. త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన కూడా రావచ్చని భావిస్తున్నారు.
పెళ్లి తర్వాత చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసే అవకాశముంది. సెలబ్రెటీలందరూ కొన్నేళ్ల నుంచి ఇలాగే డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుని, తమ సిటీలో రిసెప్షన్లు పెడుతున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ రజినీకాంత్ సతీమణి లత సోదరుడైన ఒకప్పటి నటుడు రవిచందర్ తనయుడే అనిరుధ్. టీనేజీలోనే సంగీతంలో అతను సంచలనాలు రేపాడు. 18 ఏళ్ల వయసులో 3 సినిమాకు సంగీతం అందిస్తూ అతను కంపోజ్ చేసిన కొలవరి పాట సెన్సేషన్ క్రియేట్ చేసింది.
అనతి కాలంలోనే అతను తమిళంలో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగాడు. ఆపై తెలుగు, హిందీలోనూ భారీ చిత్రాలకు పని చేసి ఇప్పుడు ఇండియా మొత్తంలో అగ్రశ్రేణి సంగీత దర్శకుల్లో ఒకడిగా కొనసాగుతున్నాడు. యూత్‌లో తన క్రేజ్ వేరే లెవెల్లో ఉంది. ఇక కావ్య సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును విజయవంతంగా నడిపిస్తూ, ఆ జట్టు మ్యాచ్‌ల్లో తళుక్కుమంటూ మంచి పాపులారిటీ సంపాదించింది.
This post was last modified on August 17, 2026 10:30 pm
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…
తల్లిదండ్రులపై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వరకు ఉండాల్సిందే. కానీ, జ్యాతస్యహి ధ్రువో మృత్యు.. అన్నట్టుగా కాలం…
భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…
వన్డేల్లో 405 పరుగులు చేసిన తర్వాత కూడా ఓడిపోతామని వెస్టిండీస్ ఊహించి ఉండదు. గువాహటిలో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు.…