Political News

చిరంజీవి పార్టీని తలపించేలా సాయి రెడ్డి పార్టీ పేరు

వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి తన కొత్త పార్టీ పేరును ఈ రోజు ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం ప్రకటించినట్లుగానే నవంబరు 11వ తేదీ ఉదయం 11 గంటల 11 నిమిషాలకు తన పార్టీ పేరును వెల్లడించారు. ‘పరివర్తన రాజనీతి పార్టీ’ (PRP) పేరుతో తన రాజకీయ ప్రస్థానంలో రెండో ఇన్నింగ్స్ ను సాయిరెడ్డి షురూ చేశారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ(పీఆర్పీ)ని గుర్తుకు తెచ్చేలా సాయిరెడ్డి తన పార్టీ పేరు పెట్టిన వైనం చర్చనీయాంశమైంది.

జనం కోసం..జనహితం కోసం..దేశం కోసం..ధర్మం కోసం…అన్న నినాదంతో సాయిరెడ్డి ముందుకు పోతున్నారు. పీఆర్పీ జెండాను కూడా ఆయన ఆవిష్కరించారు. రాష్ట్రంలో కుటుంబాల ఆధిపత్యానికి, అవినీతికి మరియు కక్షపూరిత రాజకీయాలకు ముగింపు పలకాలన్న ఉద్దేశ్యంతోనే ఈ పార్టీ పెడుతున్నానని సాయిరెడ్డి గతంలో చెప్పారు.

యువతకు (25 నుండి 40 ఏళ్ల మధ్య వయసు వారికి 66 శాతం టికెట్లు) కేటాయించడం, ఉచిత విద్యుత్, ప్రతి ఎకరానికి నీరు అందించడం, ఉద్యోగ అవకాశాలు మరియు ధరల నియంత్రణ వంటి అంశాలపై దృష్టి సారించడం తన పార్టీ ఎజెండా అని తెలిపారు. ఇక, తాను లేదా తన కుటుంబం నుండి 2029లో ఎవరూ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేయరని, తాను కేవలం ఒక మార్గదర్శిగా (మెంటార్‌గా) మాత్రమే ఉంటానని గతంలోనే ఆయన ప్రకటించారు.

This post was last modified on November 11, 2026 12:22 pm

Share

Recent Posts

సిద్దు సరైన దారిలోనే వెళ్తున్నాడు

డీజే టిల్లు బ్లాక్ బస్టర్ అయ్యాక సిద్దు జొన్నలగడ్డ ఎక్కడికో వెళ్ళిపోతాడని అందరూ భావించారు. దానికి తగ్గట్టే టిల్లు స్క్వేర్…

36 minutes ago

మాతృభూమి… ఇదేం కంటెంట్ స్వామీ

ఒకప్పుడు సల్మాన్ ఖాన్ సినిమా వస్తోందంటే అదో పెద్ద సంబరంగా ఉండేది. అభిమానులే కాదు సగటు ప్రేక్షకులు కూడా కండల…

2 hours ago

వెయిట్ లాస్ ఇంజెక్షన్ల వాడేవారికి షాకింగ్ న్యూస్!

బరువు తగ్గాలంటే ఆహార నియంత్రణ, వ్యాయామం, క్రమశిక్షణ అవసరమనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ప్రస్తుత రోజుల్లో చాలామంది శారీరక…

5 hours ago

కోన‌సీమ‌లో వైసీపీకి కాక‌.. సొంత నేత‌లే దెబ్బేశారా.. ?

ఉమ్మడి తూర్పుగోదావ‌రి జిల్లాలోని కోన‌సీమ‌(ప్ర‌స్తుతం ప్ర‌త్యేక జిల్లా)లో వైసీపీ ఘోరంగా దెబ్బ‌తింది. గ‌త 2019 ఎన్నిక‌ల్లో బ‌ల‌మైన ప్ర‌భావం చూపించిన…

5 hours ago

వారణాసి తెలుగు బిజినెస్ అంత పలికిందా

ఖచ్చితంగా విడుదల తేదీలో మార్పు ఉండదనే దిశగా సంకేతాలు వస్తున్నాయి కాబట్టి వారణాసి రిలీజ్ కాబోయే ఏప్రిల్ 7 కోసం…

6 hours ago

స్థానిక ఎన్నిక‌ల్లో ‘ఇన్‌ఫ్లుయెన్స‌ర్ల’ ప్ర‌భావం ఎంత‌?: చంద్ర‌బాబు ఆరా

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్రభావం ఓటర్లపై ఎంతవరకు పడింది అనే అంశంపై…

7 hours ago