Movie News

పాట రాకుండానే ‘ప్యారడైజ్’ ట్రెండింగ్

షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో టీమ్ చాలా ఒత్తిడిలో ఉంది కానీ ప్యారడైజ్ మీద క్షేత్ర స్థాయిలో ఎంత బజ్ ఉందో వాళ్ళు కనక అర్థం చేసుకుంటే రోజుకో అప్డేట్ ఇవ్వాల్సి ఉంటుంది. కేవలం నాని అభిమానులే కాకుండా రెగ్యులర్ మూవీ లవర్స్ సైతం దీని మీద విపరీతమైన ఎగ్జైట్ మెంట్ చూపిస్తున్నారు. సెప్టెంబర్ 24 కోసం మాములు వెయిటింగ్ లో లేరు. ఇప్పటిదాకా పాటల పరంగా వచ్చింది ఆయా షేర్ ఒక్కటే. నెక్స్ట్ సాంగ్ ఎప్పుడు వస్తుందానే ఎదురు చూపులు ఓ రేంజ్ లో ఉన్నాయి.

తాజాగా సోషల్ మీడియాలో లీకైన ఒక ఆడియో క్లిప్ తెగ తిరుగుతోంది. తెలంగాణలో బాగా పాపులరైన ఒక ఫోక్ సాంగ్ రీమిక్స్ చేసి దాన్ని నాని, కీర్తి సురేష్ మీద షూట్ చేస్తుండగా, కేవలం ఆడియో రూపంలో రికార్డు చేసిన బిట్ బాగా వైరల్ అవుతోంది. నిజంగానే అది కనక దర్శకుడు శ్రీకాంత్ ఓదెల వాడి ఉంటే మటుకు నెక్స్ట్ లెవెల్ రీచ్ వస్తుంది. అందులోనూ అనిరుద్ రవిచందర్ మొదటిసారి తెలుగు సినిమాకు రీమిక్స్ చేసిన ఘనత కూడా ప్యారడైజ్ కే దక్కుతుంది.

నిజానిజాలు ఏంటో తెలియాలంటే ఇంకో మూడు నాలుగు రోజులు వెయిట్ చేయాల్సి వచ్చేలా ఉంది. ప్రస్తుతం ప్యారడైజ్ షూట్ టైట్ గా జరుగుతోంది. బాలన్స్ ఉన్న పోర్షన్లు చకచకా కానిస్తున్నారు.. నానితో పాటు మోహన్ బాబు రాఘవ్ జుయెల్ తదితరులు వీటిలో పాల్గొంటున్నారు. హీరోయిన్ కయదు లోహర్ తో ఒక పాట తీయాల్సి ఉందని ఇన్ సైడ్ టాక్. క్లైమాక్స్, జైలు ఎపిసోడ్ గురించి బయటికి వినిపిస్తున్న మాటల ప్రకారం ఈ ఏడాది బెస్ట్ యాక్షన్ సీన్స్ అవుతాయట.

ఇంకో ముప్పై ఏడు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్యారడైజ్ ప్రత్యేకంగా ప్రమోషనల్ ప్లాన్ వేసుకోవాల్సి ఉంటుంది. ప్యాన్ ఇండియా రిలీజ్ కాబట్టి దానికి అనుగుణంగానే చేసుకోవాలి. నాని సెప్టెంబర్ మొదటి వారం నుంచి మీడియాకు అభిమానులకు అందుబాటులోకి రాబోతున్నాడు. హిట్ 3 ది థర్డ్ కేస్ కే ప్రచారం హోరెత్తించిన నాని ప్యారడైజ్ కు ఏ స్థాయిలో చేస్తాడో వేరే చెప్పనక్కర్లేదు. రెండు మూడు వారాలు న్యాచురల్ స్టార్ తప్ప ఇంకెవరు కనిపించనంత హడావిడి ఉంటుంది. 

This post was last modified on August 17, 2026 11:08 pm

Share

Recent Posts

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

32 minutes ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

39 minutes ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

43 minutes ago

దుబాయ్ విమానంలో ఫైటింగ్… 180 మందిని కాపాడిన ఇండియన్ కెప్టెన్

భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…

1 hour ago

405 అయినా సరే… తగ్గేదే లే!!

వన్డేల్లో 405 పరుగులు చేసిన తర్వాత కూడా ఓడిపోతామని వెస్టిండీస్ ఊహించి ఉండదు. గువాహటిలో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు.…

1 hour ago

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

2 hours ago