Political News

సీఎం సీటుకు కూడా రిజర్వేషన్: సాయిరెడ్డి

తాము ఎవ‌రికీ `బీ-టీం` కాద‌ని రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు వేణంబాకం విజ‌య‌సాయిరెడ్డి స్ప‌ష్టం చేశారు. త‌మ‌పార్టీ పుట్ట‌క ముందే.. వైసీపీ, టీడీపీ సోష‌ల్ మీడియాలు త‌మ‌పై ఆరోప‌ణ‌లు చేశాయ‌ని అన్నారు. త‌మ పార్టీ వైసీపీకి బీ టీం అని.. జ‌గ‌న్ వ‌దిలిన బాణ‌మ‌ని టీడీపీ ప్ర‌చారం చేసింద‌ని అన్నారు. అదేస‌మ‌యంలో.. వైసీపీ వారు.. త‌న‌ను టీడీపీ బ్యాచ్‌గా చిత్రీక‌రించార‌ని చెప్పారు. కానీ, తాము ప్ర‌జ‌ల‌కు మాత్ర‌మే బీ-టీం అని ప్ర‌క‌టించారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను.. ప్ర‌జ‌ల త‌ర‌ఫున.. ప్ర‌జ‌ల కోసం ప్ర‌స్తావిస్తామ‌న్నారు.

సామాజిక న్యాయ‌మే.. త‌మ పార్టీ ధ్యేయ‌మ‌ని సాయిరెడ్డి చెప్పారు. ఈ మాట‌ను ఆయ‌న మూడు సార్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ 2029లో పోటీ చేస్తామ‌ని తెలిపారు. గ్రామ‌, మండ‌ల స్థాయిలోనూ పార్టీని పునాదుల నుంచి డెవ‌ల‌ప్ చేస్తామ‌న్నారు. యువ‌తే దీనికి కీల‌క‌మ‌ని అన్నారు.

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. తెలంగాణ అప్ప‌టి ముఖ్య‌మంత్రి కేసీఆర్ 26 బీసీ కులాల‌ను బీసీల జాబితా నుంచి తొల‌గించార‌ని తెలిపారు. వారంతా ఏపీ ఆరిజ‌న్ ఉంద‌న్న కార‌ణంతో ఆయ‌న ఆ నిర్ణ‌యం తీసుకుని బీసీల‌కు అన్యాయం చేశార‌ని అన్నారు. దీనిని త‌ర్వాత కాలంలో టీడీపీ, వైసీపీలు ప‌ట్టించుకోలేద‌ని.. కానీ, తాము ఆ 26 బీసీ కులాల‌తో పాటు ఇత‌ర సామాజిక వ‌ర్గాల‌కు కూడా న్యాయం చేస్తామ‌న్నారు.

సీఎం, మంత్రుల్లోనూ.. రిజ‌ర్వేష‌న్ అమ‌లు చేస్తామ‌ని సాయిరెడ్డి చెప్పారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్క‌ర్ తీసుకు వ‌చ్చిన రిజ‌ర్వేష‌న్ విధానం కొన్నింటికి మాత్ర‌మే వ‌ర్తింప‌చేస్తున్నార‌ని అన్నారు. ముఖ్య‌మైన రాజ‌కీయ ప‌ద‌వులు .. సీఎం, మంత్రుల విష‌యంలో రిజ‌ర్వేష‌న్‌ను ఎందుకు అమ‌లు చేయ‌డం లేద‌న్నారు. పీఆర్ పీ అధికారంలోకి వ‌స్తే … ఈ విష‌యంలోనూ రిజ‌ర్వేష‌న్‌ను అమ‌లు చేస్తామ‌ని సాయిరెడ్డి ఉద్ఘాటించారు.

ఆల‌యాల అంశంపై..

టీటీడీ రాజ‌కీయ నిరుద్యోగుల‌కు ఆవాసంగా మారింద‌ని సాయిరెడ్డి విమ‌ర్శ‌లుగుప్పించారు. ఈ విష‌యాన్ని తాను ముందుగానే చెప్పాన‌న్నారు. రాజ‌కీయంగా నిరుద్యోగులుగా ఉన్న వారికి కొలువులు ఇచ్చార‌ని తెలిపారు. తాము స‌భ్యుడిగా ఉన్న‌ప్పుడు.. 11 మంది స‌భ్యులు ఉండ‌గా.. ప్ర‌స్తుతం 50 మందికిపైగా ఉన్నార‌ని చెప్పారు. పీఆర్‌పీ అధికారంలోకి రాగానే.. తిరుమ‌ల‌లో వెయ్యికాళ్ల మండ‌పాన్ని పున‌ర్నిర్మాస్తామ‌ని చెప్పారు. రాజ‌కీయ పున‌రావాస కేంద్రం కాకుండా ఆల‌యాల‌ను కాపాడుతామ‌న్నారు. 

This post was last modified on November 11, 2026 12:36 pm

Share

Recent Posts

చిరంజీవి పార్టీని తలపించేలా సాయి రెడ్డి పార్టీ పేరు

వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి తన కొత్త పార్టీ పేరును ఈ రోజు ప్రకటించారు. కొద్ది…

39 minutes ago

సిద్దు సరైన దారిలోనే వెళ్తున్నాడు

డీజే టిల్లు బ్లాక్ బస్టర్ అయ్యాక సిద్దు జొన్నలగడ్డ ఎక్కడికో వెళ్ళిపోతాడని అందరూ భావించారు. దానికి తగ్గట్టే టిల్లు స్క్వేర్…

1 hour ago

మాతృభూమి… ఇదేం కంటెంట్ స్వామీ

ఒకప్పుడు సల్మాన్ ఖాన్ సినిమా వస్తోందంటే అదో పెద్ద సంబరంగా ఉండేది. అభిమానులే కాదు సగటు ప్రేక్షకులు కూడా కండల…

2 hours ago

వెయిట్ లాస్ ఇంజెక్షన్ల వాడేవారికి షాకింగ్ న్యూస్!

బరువు తగ్గాలంటే ఆహార నియంత్రణ, వ్యాయామం, క్రమశిక్షణ అవసరమనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ప్రస్తుత రోజుల్లో చాలామంది శారీరక…

5 hours ago

కోన‌సీమ‌లో వైసీపీకి కాక‌.. సొంత నేత‌లే దెబ్బేశారా.. ?

ఉమ్మడి తూర్పుగోదావ‌రి జిల్లాలోని కోన‌సీమ‌(ప్ర‌స్తుతం ప్ర‌త్యేక జిల్లా)లో వైసీపీ ఘోరంగా దెబ్బ‌తింది. గ‌త 2019 ఎన్నిక‌ల్లో బ‌ల‌మైన ప్ర‌భావం చూపించిన…

5 hours ago

వారణాసి తెలుగు బిజినెస్ అంత పలికిందా

ఖచ్చితంగా విడుదల తేదీలో మార్పు ఉండదనే దిశగా సంకేతాలు వస్తున్నాయి కాబట్టి వారణాసి రిలీజ్ కాబోయే ఏప్రిల్ 7 కోసం…

7 hours ago