Movie News

మాతృభూమి… ఇదేం కంటెంట్ స్వామీ

ఒకప్పుడు సల్మాన్ ఖాన్ సినిమా వస్తోందంటే అదో పెద్ద సంబరంగా ఉండేది. అభిమానులే కాదు సగటు ప్రేక్షకులు కూడా కండల వీరుడిని తెరమీద చూసేందుకు ఉత్సాహపడేవాళ్ళు. కానీ గత కొంత కాలంగా సల్మాన్ ట్రాక్ రికార్డు ఏ మాత్రం బాలేదు. సికందర్ లాంటి డిజాస్టర్లు తన ఇమేజ్ ని మరింత డ్యామేజ్ చేశాయి. ఒకపక్క షారుఖ్ ఖాన్ హ్యాట్రిక్ హిట్లతో దూసుకుపోతూ ఉంటే ఇటుపక్క సల్లు భాయ్ విజయం కోసం నానా తంటాలు పడుతున్నాడు. డిసెంబర్ 4 తన కొత్త మాతృభూమి రిలీజ్ కానుంది.

నిన్న ట్రైలర్ విడుదల చేశారు. ఏకంగా నాలుగున్నర నిముషాలు కట్ చేయడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. 2020 ఇండియా చైనా సరిహద్దుల్లో జరిగిన గాల్వన్ యుద్ధం ఆధారంగా దర్శకుడు అపూర్వ లఖియా దీన్ని తెరకెక్కించారు. ఆ సమయంలో సరిహద్దుల దగ్గర ఏర్పడిన ఉద్రిక్తతలు, ఎమోషన్లు, సైనికుల త్యాగాలు మొదలైనవి ఇందులో టచ్ చేయబోతున్నారు. యుద్ధాన్ని శత్రుత్వంతో కాకుండా స్నేహంతో ముగించాలని గొప్ప సందేశాన్ని పొందుపరిచారు.

సమస్య ఎక్కడ వచ్చిందంటే ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం వచ్చిన బోర్డర్ తో మొదలుపెట్టి నిన్నా మొన్నటి షేర్షా దాకా ఎన్నో వార్ సినిమాల కలబోతగా మాతృభూమి కనిపిస్తోంది. పైగా చైనా మీద అవసరానికి మించిన సాఫ్ట్ కార్నర్ చూపించడం డైలాగుల్లో స్పష్టంగా వినిపించింది. సైనికుడిగా సల్మాన్ లుక్స్ కూడా ఏమంత ఫిట్ గా కనిపించడం లేదు. హిమేష్ రేషమియా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంతంత మాత్రంగా ఉంది. సోషల్ మీడియా జనాలు బాగా ట్రోల్ చేస్తున్నారు.

ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే మాతృభూమి దర్శకుడు అపూర్వ లఖియానే రామ్ చరణ్ కు జంజీర్ లాంటి అల్ట్రా డిజాస్టర్ ఇచ్చింది. తర్వాత శ్రద్ధ కపూర్ తో హసీనా పార్కర్ అనే మరో కళాఖండం తీశాడు కానీ అది కూడా అంతంత మాత్రంగానే ఆడింది. షారుఖ్ కింగ్ రాబోయే ఇరవై రోజుల ముందు థియేటర్లకు వస్తున్న మాతృభూమికి ముందు అనుకున్న టైటిల్ బాటిల్ అఫ్ గాల్వన్. ఈ పేరు మీద అభ్యంతరాలు రావడంతో మార్చారు. కానీ ఇప్పుడదే మైనసయ్యేలా ఉంది. హీరోయిన్ గా చిత్రాంగద సింగ్ నటించింది. 

This post was last modified on November 11, 2026 10:53 am

Share

Recent Posts

వెయిట్ లాస్ ఇంజెక్షన్ల వాడేవారికి షాకింగ్ న్యూస్!

బరువు తగ్గాలంటే ఆహార నియంత్రణ, వ్యాయామం, క్రమశిక్షణ అవసరమనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ప్రస్తుత రోజుల్లో చాలామంది శారీరక…

3 hours ago

కోన‌సీమ‌లో వైసీపీకి కాక‌.. సొంత నేత‌లే దెబ్బేశారా.. ?

ఉమ్మడి తూర్పుగోదావ‌రి జిల్లాలోని కోన‌సీమ‌(ప్ర‌స్తుతం ప్ర‌త్యేక జిల్లా)లో వైసీపీ ఘోరంగా దెబ్బ‌తింది. గ‌త 2019 ఎన్నిక‌ల్లో బ‌ల‌మైన ప్ర‌భావం చూపించిన…

3 hours ago

వారణాసి తెలుగు బిజినెస్ అంత పలికిందా

ఖచ్చితంగా విడుదల తేదీలో మార్పు ఉండదనే దిశగా సంకేతాలు వస్తున్నాయి కాబట్టి వారణాసి రిలీజ్ కాబోయే ఏప్రిల్ 7 కోసం…

5 hours ago

స్థానిక ఎన్నిక‌ల్లో ‘ఇన్‌ఫ్లుయెన్స‌ర్ల’ ప్ర‌భావం ఎంత‌?: చంద్ర‌బాబు ఆరా

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్రభావం ఓటర్లపై ఎంతవరకు పడింది అనే అంశంపై…

5 hours ago

సూర్య నుండి చాలా నేర్చుకోవాలి

ఒకప్పుడు వీరేంద్ర సెహ్వాగ్ అంటే బ్యాటింగ్ ఫైర్ అనేవాళ్లు. ట్రిపుల్ సెంచరీ దగ్గర ఉన్నప్పుడు సిక్సర్ కొట్టాలంటే దానికి చాలా…

7 hours ago

ఫ‌స్ట్ టైమ్‌: భ‌ర్త‌కు అన్నీ తానై.. త‌ల‌కొరివి పెట్టిన భార్య‌!

ప్రాణాలు విడిచిన భ‌ర్త‌కు.. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ భార్యా త‌ల‌కొరివి పెట్టిన సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌లేదు. ఆ దంప‌తుల‌కు కుమారులు లేక‌పోతే..…

7 hours ago