సూర్యకు ఈ ఏడాది బాగానే కలిసి వస్తోంది. ‘వీరభద్రుడు’ తర్వాత ఇప్పుడు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కూడా మంచి రన్‌లో ఉంది. మొదటి వీకెండ్‌కే ప్రపంచవ్యాప్తంగా దాదాపు వంద కోట్ల గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. ఇలాంటి టైంలో అదే ఫ్యామిలీ జోన్‌లో మరో సినిమా ప్లాన్ చేసుకోవడం ఈజీ. కానీ సూర్య రాబోయే లైనప్ చూస్తే మాత్రం ఒకే ఫార్ములాను పట్టుకుని వెళ్లే ఉద్దేశం కనిపించడం లేదు.
ముందుగా రావాల్సింది జీతూ మాధవన్ సినిమా. ‘ఆవేశం’, ‘రోమాంచం’తో తనకంటూ ఒక స్టైల్ తెచ్చుకున్న జీతూ ఈసారి సూర్యను పోలీస్ పాత్రలో చూపిస్తున్నాడు. ఇది రెగ్యులర్ పవర్‌ఫుల్ కాప్ సినిమా కాదు. యాక్షన్‌లో కామెడీ మిక్స్ అయ్యి ఉంటుందట. షూటింగ్ పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది. దాని తర్వాత సూర్య మళ్లీ ‘జై భీమ్’ దర్శకుడు టీజే జ్ఞానవేల్ దగ్గరకు వెళ్తున్నాడు. హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్. ప్రకాష్ రాజ్, యోగిబాబు కూడా ఉన్నారు.
‘ఐదు రూపాయల డాక్టర్’గా పేరున్న డాక్టర్ తిరువెంగడం జీవితం నుంచి కథకు ప్రేరణ తీసుకుంటున్నారనే రిపోర్ట్స్ ఉన్నాయి. కానీ మేకర్స్ మాత్రం ఇంకా కథను అధికారికంగా బయటపెట్టలేదు. ఇవి రెండూ ఒక ఎత్తయితే ‘రోలెక్స్’ మరో ఎత్తు. ‘విక్రమ్’లో కొన్ని నిమిషాలే కనిపించిన ఈ పాత్రకు వచ్చిన క్రేజ్ తర్వాత పూర్తి సినిమా కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం రోలెక్స్ స్క్రిప్ట్ రాస్తున్నాడని సూర్య ఈ నెలలోనే చెప్పాడు. అయితే షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందన్నది ఇంకా క్లారిటీ లేదు.
విశ్వనాథ్‌లో ఫ్యామిలీ మ్యాన్‌గా కనిపించిన సూర్య, నెక్స్ట్ సినిమాలో కాస్త ఫన్నీ టచ్ ఉన్న పోలీస్‌గా మారబోతున్నాడు. ఆ తర్వాత జ్ఞానవేల్‌తో మరో కంటెంట్ బేస్డ్ సినిమా ఉంది. రోలెక్స్ వస్తే పూర్తిగా డార్క్ గ్యాంగ్‌స్టర్ జోన్. ‘వాడివాసల్’ మాత్రం ఇప్పటికీ ఈ లైనప్‌లో క్లియర్‌గా కనిపించడం లేదు. ఈ ఏడాది మొదట్లో వచ్చిన కొత్త షూటింగ్ వార్తలను టీమ్ ఖండించింది. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలే చూస్తే సూర్యకు ఒక విషయం మాత్రం ప్లస్. ఒకే ఇమేజ్ మీద మూడు సినిమాలు పెట్టకుండా, మూడు వేర్వేరు రుచుల కథలను రెడీ చేసుకుంటున్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates