అద్భుతమైన రోజు ‘ఫౌజీ’ ఇచ్చే కానుక ఏంటి  

భారతీయులందరూ సగర్వంగా ఫీలయ్యే రోజు ఆగస్ట్ 15. బ్రిటిష్ పాలకుల దాస్య సంకెళ్లను తెచ్చుకుని ఎందరో మహనీయులు చేసిన త్యాగాలు మనకు విముక్తిని తీసుకొచ్చాయి. ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాణం పోసి దేశాన్ని అభివృద్ధి పధం వైపు నడిపించాయి. ఇప్పటి తరానికి ఒక నేషనల్ హాలిడేగా దీన్ని ఎంజాయ్ చేయడమే తెలుసు తప్పించి ఫ్రీడమ్ ఫైట్ వెనుక జరిగిందేంటో తెలుసుకునే ప్రయత్నం చేసేవాళ్ళు చాలా తక్కువ. దీనికి ఫౌజీకి లింక్ ఏంటో చూద్దాం.

డిసెంబర్ 3 విడుదల కాబోతున్న ఫౌజీ మీద ఎన్ని అంచనాలు ఉన్నాయో తెలిసిందే. ఇండిపెండెన్స్ రాక ముందు జరిగిన కొన్ని సంఘటనలు ఆధారంగా చేసుకుని దర్శకుడు హను రాఘవపూడి ఒక ఎమోషనల్ సబ్జెక్టుని ప్రేక్షకులకు అందివ్వబోతున్నారు. ప్రభాస్ హీరో కావడంతో దీని మీద ప్యాన్ ఇండియా స్థాయిలో అంచనాలున్నాయి. అయితే రిలీజ్ ఇంకో నాలుగు నెలలే ఉంది కాబట్టి స్వాతంత్ర దినోత్సవానికి ఏదైనా టీజర్ లాంటి కానుకని ఫ్యాన్స్ ఆశించారు.

విశ్వాసనీయ సమాచారం ప్రకారం అలాంటిదేమి ఉండకపోవచ్చని తెలిసింది. టీజర్ లో పొందుపరిచాల్సిన ఒక ముఖ్యమైన సన్నివేశాన్ని మొన్నేప్పుడో ప్లాన్ చేసుకున్నారు. అందులో పాల్గొనాల్సిన ఆర్టిస్టు వీసా సమస్య వల్ల లండన్ లో చిక్కుకుపోవడంతో ఆ ఎపిసోడ్ వాయిదా పడింది. అది లేకుండా ఫౌజీ ప్రపంచాన్ని పరిచయం చేయడం కష్టమని భావించి ఆ ఆలోచనని డ్రాప్ చేశారట. ఇప్పటికిప్పుడు తీసినా మూడు రోజుల్లో అటాచ్ చేయడం కష్టం.

సో ప్రభాస్ ఫ్యాన్స్ పోస్టర్స్ తో సరుకోవాల్సి రావొచ్చు. ఇప్పటికే బాగా ఆలస్యమైన ఈ పీరియాడిక్ డ్రామాలో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. విశాల్ చంద్రశేఖర్ పాటల గురించి ఆల్రెడీ ఇన్ సైడ్ టాక్ చాలా పాజిటివ్ గా ఉంది. ఇప్పటికైతే ఫౌజీ బృందం ఎలాంటి సౌండ్ చేయడం లేదు. ఆగస్ట్ 15 జస్ట్ విషెష్ చెబుతూ కొత్త పోస్టర్ వదులుతారా లేక సడన్ సర్ప్రైజ్ లాగా ఏదైనా హఠాత్తుగా ట్విస్ట్ ఇస్తారా అనేది ఇంకో మూడు రోజుల్లో తేలనుంది.