ఈ మధ్య తమిళ సీనియర్ హీరోయిన్ త్రిష పెద్దగా సినిమాలు చేస్తున్నట్లు కనిపించట్లేదు. అయినా ఆమె పేరు మాత్రం నిత్యం మీడియాలో నానుతూనే ఉంటోంది. ఆమె కొన్నేళ్లుగా విజయ్‌తో కలిసి ఉంటోందన్న వార్త కొన్ని నెలలుగా ప్రచారంలో ఉంది. తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ విషయం ఎంత పెద్ద చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఇద్దరూ కలిసి బయటి రావడంతో అనుమానాలు మరింత పెరిగాయి.
విజయ్ ఎన్నికల్లో విజయం సాధించి సీఎం అయ్యాక త్రిష మీద ఫోకస్ మరింత పెరిగింది. ఆమె ఎక్కడ కనిపించినా.. ఏం మాట్లాడినా.. ఏ సోషల్ మీడియా పోస్టు పెట్టినా.. అందరి దృష్టీ అటు మళ్లుతోంది. విజయ్‌కి ఆమె పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పినా వార్తే, చెప్పకపోయినా వార్తే. అప్పుడప్పుడూ త్రిష పెట్టే క్రిప్టిక్ సోషల్ మీడియా పోస్టులు కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. తాజాగా అలాంటి పోస్టే ఒకటి పెట్టిందామె.
‘‘ఈ వయసులో డ్రామాలు చేయడం నిజంగా సిగ్గుచేటు, పోయి నాలుగు రాళ్లు సంపాదించుకుని ప్రశాంతంగా బతకండి’.. ఇదీ త్రిష ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్న కోట్ సారాంశం. ఇది విజయ్ భార్య సంగీతను ఉద్దేశించి అంటూ సోషల్ మీడియాలో ఒక ప్రచారం మొదలైంది. విజయ్ కొన్నేళ్లుగా సంగీత నుంచి దూరంగా ఉంటుండగా.. త్రిషతో అతడి సంబంధం నేపథ్యంలో ఎన్నికల ముంగిట భర్త నుంచి విడాకులు కోరుతూ సంగీత కోర్టుకు వెళ్లారు. ఆ సందర్భంగా ఆయన మీద అనేక ఆరోపణలు కూడా చేశారు.
ఇక వీళ్లిద్దరూ అధికారికంగా విడిపోవడం లాంఛనమే అనుకుంటుండగా.. ఇటీవల సంగీత విడాకుల పిటిషన్‌ను వెనక్కి తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. విజయ్, సంగీతలను కలిపేందుకు ఇరు కుటుంబాల పెద్దలు గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఇది త్రిషకు నచ్చకే ఈ పోస్టు పెట్టిందా అనేే చర్చ జరుగుతోంది. ఆమె ఉద్దేశం ఏదైనప్పటికీ.. ఈ పోస్టు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates