Political News

స్థానిక ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ముచ్చెమటలు

రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో అధికార బీజేపీతో ప్రతిపక్ష కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అంటూ పోటీ పడింది. బీజేపీ కంచుకోటల్లో సైతం సత్తా చాటింది. అనూహ్యంగా స్వతంత్ర అభ్యర్థులు సైతం అత్యధిక స్థానాల్లో గెలుపు సాధించడం విశేషం. సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులు జెండా ఎగరేయడం సంచలనం సృష్టిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలవడం చర్చగా మారింది.

రాజస్థాన్ లోని 309 మున్సిపాలిటీలో గల 10, 245 వార్డులకు ఈనెల 9.11 తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించారు. 14 వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదల చేశారు. ఇందులో కార్పొరేషన్లు, మున్సిపల్ కౌన్సిల్లు కూడా వున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ , ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య హోరా హోరీగా జరిగాయి. పలు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పట్టించారు. ప్రలోభాలకు లొంగకుండా, తీవ్రమైన ఒత్తిళ్లకు తలోగ్గకుండా మూడో స్థానంలో నిలవడం ఇప్పుడా రాష్ట్రంలో పెద్ద చర్చకు దారి తీసింది.

అధికార బీజేపీ 4179 వార్డుల్లో విజయం సాధించింది. దానికి ఏమాత్రం తగ్గకుండా ప్రతిపక్ష కాంగ్రెస్ 3,613 వార్డుల్లో జయకేతనం ఎగరేసింది. స్వతంత్ర అభ్యర్థులు 2,273 వార్డులను కైవసం చేసుకున్నారు. బికనీర్ జిల్లా నోఖా మున్సిపాలిటీలో సిపిఎం విజయం సాధించి విస్మయ పరిచింది. ఇక్కడ 45 వార్డులు వుండగా సిపిఎం 39 వార్డులను గెలిచి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది.

మొత్తం 10 మున్సిపల్ కార్పొరేషన్లలో అధికార బీజేపీ కేవలం నాలుగు కార్పొరేషన్లలో మాత్రమే విజయం సాధించింది. ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ సొంత ఊరైన భరత్ పూర్ మున్సిపల్ కార్పొరేషన్లో స్వతంత్ర అభ్యర్థులు ఏకంగా 36 వార్డులను గెలుచుకొని కార్పొరేషన్లో జెండా పాగా వేశారు. కాంగ్రెస్ పార్టీ బికనీర్ తో పాటు మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే నియోజకవర్గం పరిధిలోని ఝలావర్ మున్సిపాలిటీల్లో గెలిచింది.
బీజేపీ కంచుకోటలుగా పేరున్న పలు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గెలవడం మారుతున్న రాజకీయ పరిణామాలకు అద్దం పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

This post was last modified on September 15, 2026 11:08 am

Share

Recent Posts

యువతుల పిచ్చి… ఫోటోకి లక్ష రూపాయలా?

చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…

50 minutes ago

13 కోట్ల ఓట్లు ఎవరి అనుమతితో తొలగించారు?

కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…

3 hours ago

ట్రబుల్ తట్టుకుని నిలబడుతుందా

రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…

3 hours ago

గరివిడి లక్ష్మి చేస్తోంది పెద్ద సాహసమే

దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…

4 hours ago

అద్భుత ప్రయోగాల నిలయం ‘సింగీతం’

లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…

4 hours ago

ఒక్క పిల్ల‌ర్‌పైనే వైసీపీ భారం… !

వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న పార్టీ. ఈ పార్టీ ప్ర‌భావం నానాటికి త‌గ్గిపోతోంద‌న్న వాద‌న ఒక‌వైపు…

7 hours ago