Movie News

కాకా ఎప్పుడు వస్తే బాగుంటుంది

2027 సంక్రాంతికి విశ్వంభర విడుదల దాదాపు ఖాయమేనని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ చిరంజీవి అంగీకారం సంపూర్ణంగా రాగానే అనౌన్స్ మెంట్ ఇవ్వడానికి యువి క్రియేషన్స్ రెడీ అవుతోంది. అయితే పండగ స్లాట్ ని ముందు తీసుకున్న కాకా పరిస్థితి ఏమిటనే ప్రశ్న మెగాభిమానుల మెదళ్లను తొలిచేస్తోంది. ఒకవేళ నిజంగా తప్పుకోవాల్సి వస్తే నెక్స్ట్ ఎప్పుడు రావాలనేది చాలా కీలకం కానుంది. ఇక్కడ పలు చిక్కుముళ్లు ఉన్నాయి.

మార్చి నుంచి వరసగా ప్యాన్ ఇండియా సినిమాలు క్యూ కట్టాయి. ఒకవేళ ఫౌజీ వస్తే స్పిరిట్ డేట్ ఛేంజ్ చేయాల్సి ఉంటుంది. సందీప్ వంగ ఒప్పుకోకపోతే తన మూవీ తేదీ మారకపోవచ్చు. అయితే ఏప్రిల్ లో వారణాసి ఉంది. దాని దరిదాపుల్లో అంటే కనీసం నెల రోజుల పాటు ఎవరూ పోటీకి వెళ్లే సాహసం చేయరు. ఇరుముడి లాంటి మీడియం బడ్జెట్ చిత్రమే పాతిక రోజుల రన్ ఎంత తేలికో చూపించినప్పుడు వారాణసి థియేటర్ రన్ అంచనాలకు అందని స్థాయిలో ఉంటుందనేది వాస్తవం.

అటుపై డ్రాగన్ వస్తుంది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ జూన్ తేదీని మార్చే ఉద్దేశంలో లేరట. ఇవన్నీ చూసుకుంటే కాకా ఫిబ్రవరిలో వస్తే మేలేమోననే అభిప్రాయం ఫ్యాన్స్ లో వినిపిస్తోంది. మాములుగా ఈ నెలకి స్టార్ హీరోలు అంతగా ప్రాధాన్యం ఇవ్వరు. అయినా కూడా బోలెడు హిట్స్ ఫిబ్రవరి ఖాతాలో ఉన్నాయి. మరి కాకా కనక సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే మంచిదే. పాజిటివ్ టాక్ వస్తే చాలు సీజన్ తో సంబంధం లేకుండా చిరంజీవి వసూళ్లు కొల్లగొట్టేస్తారు.

మొత్తానికి మెగా కన్ఫ్యూజన్ తీరాలంటే ఇంకొద్ది రోజులు వేచి చూడాల్సి వచ్చేలా ఉంది. కాకా షూటింగ్ నిర్విరామంగా జరిగిపోతోంది. విశ్వంభరని నమ్ముకుని స్లో చేస్తే తర్వాత ఇబ్బంది పడాల్సి రావొచ్చు కనక ముందు అనుకున్న ప్లానింగ్ ప్రకారమే ఎలాంటి బ్రేక్స్ లేకుండా చేసుకుంటూ పోతున్నారు. కాకాకి తమన్ సంగీతం సమకూరుస్తుండగా విశ్వంభరకు కీరవాణి, భీమ్స్, గౌర హరి పని చేశారు. చూడాలి మరి ఇంకా ఎలాంటి పరిణామాలు, మార్పులు చోటు చేసుకోబోతున్నాయో.  

This post was last modified on September 15, 2026 12:52 pm

Share

Recent Posts

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

11 minutes ago

మల్టీస్టారర్ మూవీకి మర్చిపోలేని అవమానం

కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…

53 minutes ago

ఆంధ్రా ముద్దుబిడ్డ అనంత్ అంబానీ

నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…

1 hour ago

చాక్లెట్లు తీసుకొని టిక్కెట్లు ఇచ్చిన సీఎం

తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…

2 hours ago

వివేకా కేసులో అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు

వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…

2 hours ago

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

3 hours ago