Movie News

మాస్ రాజా ఈజ్ బ్యాక్

తెలుగులో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా.. చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి పెద్ద రేంజికి చేరుకున్న హీరోల్లో రవితేజ ఒకడు. మెగాస్టార్ చిరంజీవి తర్వాత ‘కష్టే ఫలి’ అనే సూత్రాన్ని పాటించి స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు రవితేజ. బ్యాగ్రౌండ్ లేకుండా చిన్న పాత్రలతో మొదలు పెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ అలాంటి ఇమేజ్, ఫాలోయింగ్ సంపాదించడం సామాన్యమైన విషయం కాదు. అందుకే రవితేజను అందరూ అభిమానిస్తారు. అతడి పట్ల ఎలాంటి నెగెటివిటీ కనిపించదు.

రవితేజ సినిమా వస్తే అందరు హీరోల అభిమానులూ చూస్తారు. అతడికి హిట్టు రావాలని అందరూ కోరుకుంటారు. కానీ కొన్నేళ్లుగా మాస్ రాజాకు అస్సలు కలిసి రావట్లేదు. ‘రాజా ది గ్రేట్’ మినహాయిస్తే హిట్టే రాలేదు రవితేజ నుంచి. దానికి ముందు, తర్వాత అన్నీ ఫ్లాపులు, డిజాస్టర్లే. చివరగా అయితే టచ్ చేసి చూడు, అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కో రాజా సినిమాలు రవితేజకు తీవ్ర నిరాశను మిగిల్చాయి.

ఈ నేపథ్యంలో రవితేజ, అతడి అభిమానుల ఆశలన్నీ ‘క్రాక్’ మీదే నిలిచాయి. ఈ సినిమా వారి ఆకాంక్షలను నిలబెట్టే లాగే ఉంది. కొత్త ఏడాదిలో మొదటగా రిలీజైన ఈ సినిమాకు తొలి రోజు రిలీజ్ విషయంలో అడ్డంకులు ఎదురైనప్పటికీ.. అవి తొలగిపోగానే బాక్సాఫీస్‌లో రీసౌండ్ వినిపిస్తోంది. సినిమాకు అన్ని చోట్లా మంచి టాక్ వస్తోంది. వసూళ్లూ బాగున్నాయి. అన్నింటికీ మించి తన గత సినిమాల ప్రభావం ఏమీ కనిపించకుండా రవితేజ ఫుల్ ఎనర్జీతో మాస్ పెర్ఫామెన్స్ ఇవ్వడం అతడి అభిమానులకు అమితానందాన్నిస్తోంది.

పోలీస్ పాత్రలంటేనే మామూలుగా రవితేజ రెచ్చిపోతాడు. ఇక పవర్ ఫుల్ సీన్లు, ఎలివేషన్లు పడితే మాస్ రాజా ఇంకా దూకుడు చూపిస్తాడు. ‘క్రాక్’లో అదే జరిగింది. ఈ సినిమాలో పెద్దగా కొత్తదనం లేకపోయినా రవితేజ నుంచి ఆశించే మాస్ అంశాలు మాత్రం పుష్కలం. ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర మాస్ రాజా తన మార్కు ఎనర్జీతో సినిమాను పైకి లేపాడు. ఆ తర్వాత సినిమా చివరి వరకు ఆ దూకుడు కొనసాగింది. ‘విక్రమార్కుడు’, ‘పవర్’ చిత్రాల తర్వాత రవితేజకు బాగా నప్పిన, అతను మంచి ఎనర్జీతో చేసిన పోలీస్ పాత్ర ఇదే. టాక్ పాజిటివ్‌గానే ఉంది, ఇంకో నాలుగు రోజులు పోటీ లేదు కాబ్టి రవితేజ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కబోతున్నట్లే.

This post was last modified on January 10, 2021 4:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

6 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

7 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

7 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

8 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

9 hours ago