Movie News

రామాయ‌ణంలో వాళ్లిద్దరూ ఎక్క‌డ‌?

చాన్నాళ్ల నుంచి భార‌తీయ ప్రేక్ష‌కులు ఎదురు చూస్తున్న ప్రోమో రానే వ‌చ్చింది. ఇండియాస్ బిగ్గెస్ట్ ఎపిక్స్‌లో ఒక‌టైన రామాయ‌ణం ఆధారంగా రూపొందిన రామాయ‌ణ సినిమా నుంచి థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను గురువారం తెల్ల‌వారుజామున బ్ర‌హ్మ ముహూర్తంలో ట్రైల‌ర్‌ను లాంచ్ చేసింది టీమ్‌. ఈ ట్రైల‌ర్‌కు కొంత మిశ్ర‌మ స్పంద‌న ఉన్న‌ప్ప‌టికీ.. ఓవ‌రాల్‌గా పర్లేదనే ఫీడ్ బ్యాకే వ‌చ్చింది. చివ‌ర‌గా రామాయ‌ణం ఆధారంగా తెర‌కెక్కి, ట్రోల్ మెటీరియ‌ల్‌గా మారిన ఆదిపురుష్‌తో ఈ చిత్రాన్ని పోల్చడం గమనార్హం.

అదే స‌మ‌యంలో రావ‌ణుడి పాత్రను అతిగా చూపించార‌ని, సీత పాత్ర‌కు సాయిప‌ల్ల‌వి అనుకున్నంత బాగా సూట్ కాలేద‌ని, ఎఫెక్ట్స్ విష‌యంలో ఏఐ వాడ‌కం ఎక్కువైంద‌ని.. ఇలాంటి కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండ‌గా.. ట్రైల‌ర్లో ఇద్ద‌రు ముఖ్యమైన ఆర్టిస్టులు క‌నిపించ‌క‌పోవ‌డం మీద చ‌ర్చ జ‌రుగుతోంది. ఆ ఇద్ద‌రే.. స‌న్నీ డియోల్, కాజ‌ల్ అగ‌ర్వాల్.

గ‌ద‌ర్‌-2 చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్‌లో బంప‌ర్ క్రేజ్ తెచ్చుకున్న స‌న్నీ డియోల్.. రామాయ‌ణ‌లో అత్యంత ఆక‌ర్ష‌ణీయ‌మైన హ‌నుమంతుడి పాత్ర‌ను చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రామాయ‌ణం మీద ఎప్పుడు ఎవ‌రు సినిమా తీసినా.. ఆ పాత్ర మీద స్పెష‌ల్ ఫోక‌స్ పెడ‌తారు. ఆ క‌థ‌కు ఎంతో ఆక‌ర్ష‌ణ తీసుకొచ్చే పాత్ర ఇది.

కానీ రామాయ‌ణ ట్రైల‌ర్లో ఎక్క‌డా హ‌నుమంతుడి పాత్ర క‌నిపించ‌లేదు. దీంతో స‌న్నీ డియోల్ అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గుర‌య్యారు. ఐతే రామాయ‌ణంలో యుద్ధ ఘ‌ట్టం మొత్తం రెండో పార్ట్‌లో ఉంటుంద‌ని.. హ‌నుమంతుడి పాత్ర కూడా అందులోనే రంగ‌ప్ర‌వేశం చేస్తుంద‌ని తెలుస్తోంది. బ‌హుశా పార్ట్‌-1లో చివ‌ర్లో హ‌నుమంతుడి పాత్ర‌ను ప‌రిచ‌యం చేస్తారేమో. 

మ‌రోవైపు రావ‌ణుడి భార్య‌ మండోద‌రి పాత్ర‌లో కాజ‌ల్ క‌నిపించ‌నుండ‌గా.. ఆమెను ట్రైల‌ర్లో చూపించ‌లేదు. ఈ సినిమాలో త‌న‌ది చిన్న పాత్రే అని కాజ‌ల్ ఇంత‌కుముందే క్లారిటీ ఇచ్చింది. ఎంత ప్రాధాన్యం త‌క్కువున్న పాత్ర అయినా స‌రే.. ట్రైల‌ర్లో చిన్న షాట్ కూడా పెట్ట‌క‌పోవ‌డంతో కాజ‌ల్ ఫ్యాన్స్ కూడా డిజ‌ప్పాయింట్ అవుతున్నారు.

This post was last modified on July 31, 2026 8:28 am

Share

Recent Posts

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

32 minutes ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

3 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

4 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

4 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

5 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

5 hours ago