సునీల్‌కు గొప్ప పేరు తెచ్చింది, అతణ్ని ప్రేక్షకులు అమితంగా ఇష్టపడేలా చేసింది కామెడీ వేషాలే. కానీ అతను వాటిని విడిచిపెట్టి హీరో వేషాలపై మోజు పడ్డాడు. మొదట్లో కామెడీ టచ్ ఉన్న హీరో పాత్రలు, సినిమాలే చేసి మంచి ఫలితం అందుకున్న సునీల్.. ఆ తర్వాత మాత్రం గాడి తప్పాడు. రెగ్యులర్ మాస్ హీరోలు చేసే సబ్జెక్టులు ఎంచుకుని బోల్తా కొట్టాడు. ఒక దశ దాటాక పూర్తిగా హీరో వేషాలు ఆగిపోయాయి. దీంతో మళ్లీ కామెడీ, క్యారెక్టర్ రోల్స్ చేశాడు. ఈ మధ్య విలన్ వేషాల్లో సైతం కనిపిస్తున్నాడు.
ఇక మళ్లీ అతను హీరోగా నటించడం కష్టమే అనుకుంటున్న సమయంలో ఇప్పుడు మళ్లీ అతను ప్రధాన పాత్రలో ఓ సినిమా మొదలైంది. ఆ సినిమా పేరు.. వేదాంతం రాఘవయ్య. చంద్రమోహన్ అనే దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. శనివారమే ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది.
14 రీల్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ‘వేదాంతం రాఘవయ్య’ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. ఇంతకంటే విశేషం ఏంటంటే.. ఈ సంస్థలో ‘గద్దలకొండ గణేష్’ చిత్రాన్ని రూపొందించిన అగ్ర దర్శకుడు హరీష్ శంకర్.. ‘వేదాంతం రాఘవయ్య’కు కథ అందిస్తున్నాడు. అతడి సమర్పణలోనే ఈ సినిమా తెరకెక్కనుంది.
దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు సినీ పరిశ్రమలో వేదాంతం రాఘవయ్య తనకంటూ ఓ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నారు. దేవదాసు, అనార్కలి సహా అద్భుతమైన చిత్రాలను అందించారు. ఆయన వ్యక్తిగత, సినీ జీవితంలో ఎన్నో విశేషాలున్నాయి. అలాంటి వ్యక్తి జీవిత కథను తెరపైకి తేవడానికి హరీష్ శంకర్, 14 రీల్స్ అధినేతలు నడుం బిగించడం విశేషమే. సునీల్ ఈ పాత్రను ఎలా పోషిస్తాడన్నది ఆసక్తికరం. ‘మహానటి’ తరహాలో హృద్యంగా తీయగలిగితే ఈ సినిమా కూడా ప్రేక్షకులపై బలమైన ముద్ర వేసే అవకాశముంది.
This post was last modified on January 9, 2021 7:03 pm
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…
యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యంత భారీ ప్రాజెక్టుల మీద దృష్టి సారిస్తున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి…
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీ..ఇంకా పాఠాలు నేర్చుకున్న ట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా…
ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక దేవర 2 ఉంటుందా లేదా అనే దాని గురించి డిస్కషన్లు ఎక్కువయ్యాయి. డిజిటల్…