ఒకప్పుడు మెలోడీ బ్రహ్మ మణిశర్మ అంటే టాలీవుడ్ ప్రేక్షకులకు ఒక గూస్ బంప్స్ ఎమోషన్. కమర్షియల్ సినిమాలను తన నేపధ్య సంగీతంతో పది మెట్లు పైకి ఎక్కించిన ఘనత ఎన్నోసార్లు అందుకున్నారు. చిరంజీవి, బాలకృష్ణ లాంటి సీనియర్లు మొదలు మహేష్ బాబు లాంటి అప్ కమింగ్ హీరోలు అందరూ ఆయన తప్ప వేరెవరు తమకు మ్యూజిక్ ఇవ్వకూడదనే రేంజ్ లో పట్టుబట్టేవారు. ఇంత స్టార్ డం అనుభవించారు మణిశర్మ. ఇదంతా దశాబ్దంపైగా వెనుకటి గతం.
వర్తమానంలో మణిశర్మ ఫామ్ లో లేరు. అనిరుధ్ రవిచందర్, సాయి అభ్యంన్కర్ లాంటి జెన్ జీ టాలెంట్స్, తమన్, దేవిశ్రీ ప్రసాద్ లాంటి హై ఎనర్జీ కంపోజర్స్ మధ్య తన ఉనికిని చాటుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ తో కంబ్యాక్ అయినట్టే చేసి తిరిగి వరస ఫ్లాపుల్లో పడ్డారు. చిరంజీవి పిలిచి మరీ ఇచ్చిన ఆచార్యలో ఒక పాట తప్ప మిగిలిన ఆల్బమ్ సోసోగానే ఉంటుంది. కొడుకు మహతి స్వరసాగర్ సైతం సక్సెస్ లేక కనిపించడం మానేశారు.
ఇలాంటి టైంలో మణిశర్మకు చెన్నై లవ్ స్టోరీ వచ్చింది. సాయి రాజేష్ చొరవ తీసుకుని మరీ ఆయనతో చేయించుకున్న పాటలు, బీజీఎమ్ మెలోడీ బ్రహ్మలో మేజిక్ ఇంకా ఉందని ఋజువు చేశాయి. ఎక్స్ ట్రాడినరి అని చెప్పలేం కానీ కథ డిమాండ్ మేరకు ఎలాంటి సంగీతం కావాలో కొలత వేసినట్టు చాలా బాలన్స్డ్ గా ఇచ్చిన మాట వాస్తవం. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ అంత బాగా క్యారీ అవ్వడానికి కారణం దర్శకుడి టేకింగ్ తో పాటు తెరవెనుక వినిపించే మణిశర్మ బీజీఎమ్.
సరే ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ హిట్టయ్యింది కాబట్టి మణిశర్మకు మళ్ళీ అవకాశాలు వెల్లువెత్తుతాయా అంటే ఔననే చెప్పొచ్చు. కాకపోతే దాన్ని నిలబెట్టుకునేలా ఇంకా ఎక్కువ కష్టపడాలి. ఇళయరాజా, రెహమాన్ తరహాలో ఇప్పటికీ బిజీగా మారిపోవాలంటే సక్సెస్ లు ఇవ్వడం తప్ప మరో ఆప్షన్ లేదు. సినిమాలు ఫ్లాప్ అవ్వొచ్చు. కానీ సంగీతం కాకూడదు. మణిశర్మ అలాంటివి ఎన్నో మర్చిపోలేని సాంగ్స్ ఇచ్చారు. చెన్నై లవ్ స్టోరీ నుంచి దాన్ని ఇంకా బాగా కొనసాగించాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates

