బాక్సాఫీస్ వద్ద జన నాయకుడు ఫలితం ఏమిటో రెండో రోజులకే క్లారిటీ వచ్చేసింది. తమిళనాడులో వసూళ్లు బాగున్నాయి కానీ అవి కేవలం విజయ్ ఇమేజ్ వల్ల నమోదవుతున్నాయి తప్పించి కంటెంట్ వల్ల కాదు. భగవంత్ కేసరిని వీలైనంత చెడగొట్టి మరీ చేసిన రీమేక్ ప్రతికూలంగా మారింది. కమర్షియల్ ఎలిమెంట్స్ పేరుతో అవసరం లేని ఎలివేషన్లు, రాజకీయ వ్యవహారాలను జోడించడం సామాన్య ప్రేక్షకులకు రుచించడం లేదు. అందుకే నెగటివ్ రెస్పాన్స్ ఎక్కువగా ఉంది.
ఒక వారం దాకా ఏదో బండి లాక్కువచ్చినా ఆ తర్వాత కష్టమేనని ట్రేడ్ అభిప్రాయపడుతోంది. ఇదిలా ఉండగా విజయ్ కొడుకు జేసన్ సంజయ్ దర్శకత్వం వహించిన సిగ్మా ఈ నెలాఖరు 31 విడుదల కావాల్సి ఉంది. ఆ మేరకు అధికారిక ప్రకటన ఎప్పుడో ఇచ్చారు. ఒకవేళ వాయిదా పడినా మహా అంటే ఓ వారం అంటే ఆగస్ట్ 7 వచ్చే ఛాన్స్ ఉంది తప్ప అంతకన్నా ఆలస్యం చేయకపోవచ్చు. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ యాక్షన్ మూవీకి తమన్ సంగీతం ఆకర్షణగా నిలుస్తోంది.
నిజానికి జన నాయగన్ కనక పెద్ద హిట్ అయితే సిగ్మాని ఇంకొంత ఆలస్యంగా తేవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడా సమస్య లేనట్టే. కాకపోతే విజయ్ ని తక్కువంచనా వేయలేం. ఒక్కోసారి రొటీన్ రొట్ట కంటెంట్ తో కూడా రికార్డులు బద్దలు కొట్టిన ట్రాక్ రికార్డు చాలాసార్లు ఉంది. పైగా ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి కూడా. టీవీకే మంత్రులు, ఎమ్మెల్యేలు వరసపెట్టి ఈ సినిమా చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
విజయ్ చివరి సినిమా కాబట్టి వాళ్ళలా ఫీలవుతున్నారనే సందేశం ఇవ్వడం కోసం ఆలా చేస్తున్నారు. ఇదంతా పక్కనపెడితే సిగ్మాతో తానేంటో ఋజువు చేసుకుంటాననే నమ్మకం జేసన్ సంజయ్ లో ఉంది. భార్య సంగీతతో విడాకుల వ్యవహారం కోర్టులో ఉన్నప్పటికీ విజయ్ వారసుడిగా అభిమానులు సంజయ్ నే చూస్తున్నారు. కొందరు నిర్మాతలు లాంచ్ చేయాలని తెగ ప్రయత్నాలు చేశారు. కానీ ఏ నిర్ణయమైనా సిగ్మా రిలీజ్ తర్వాతే అని జేసన్ సంజయ్ తెగేసి చెబుతున్నాడట.
This post was last modified on July 25, 2026 11:39 am
దానం నాగేందర్‌పై వేటు పడడం.. ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావడం.. ఇటీవల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…
శ్రీకాంత్ ఓదెల.. ఈ పేరు చెప్పగానే అందరికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…
నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…
నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…
వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…
సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…