Movie News

స్టీవెన్ శంకర్ ప్రేమ బాగానే కనెక్టయ్యింది

తాజాగా విడుదలైన చెన్నై లవ్ స్టోరీకి ఆశించిన ఓపెనింగ్ దక్కింది. టాక్ పరంగా సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ ఒకసారి చూడొచ్చనే రికమండేషన్ బలంగా వినిపించడం వసూళ్లకు దోహదం చేస్తోంది. మొన్న రాత్రి ప్రీమియర్లు వేయడం మంచి ఫలితాన్నే ఇచ్చింది. నిన్న మెయిన్ సెంటర్స్ అన్నింటిలో చెప్పుకోదగ్గ ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. కిరణ్ అబ్బవరం, శ్రీగౌరీ ప్రియా ఉదయం నుంచే పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లు మొదలుపెట్టేసి థియేటర్లకు తిరుగుతున్నారు.

బాక్సాఫీస్ వద్ద గ్యాప్ ఇప్పుడీ చెన్నై లవ్ స్టోరీకి ఉపయోగపడుతోంది. జన నాయకుడు మనం ఎప్పుడో చూసిన భగవంత్ కేసరి రీమేక్ కావడంతో సామాన్య మాస్ ప్రేక్షకులు దానికి దూరంగా ఉంటున్నారు. విజయ్ ని అభిమానించే వాళ్ళు చూస్తుండటంతో ఏపీ తెలంగాణలో రేపటి దాకా ఒక మోస్తరు కలెక్షన్లు రావొచ్చు. సోమవారం నుంచి నిలవడం పెద్ద ఛాలెంజ్. చెన్నై లవ్ స్టోరీకి ఈ సమస్య లేదు. లెనిన్ రెండు వారాలు దాటేయడంతో ఆడియన్స్ కి ఇదొక్కటే ఛాయసయ్యింది.

ఫస్ట్ హాఫ్ చాలా బాగుందనే టాక్ తో పాటు సెకండ్ హాఫ్ మీద వచ్చిన కామెంట్స్ నిజమే అయినప్పటికీ ఓవరాల్ గా చూసుకుంటే చెన్నై లవ్ స్టోరీ నిరాశ పరచకపోవడం ఇప్పుడీ రెస్పాన్స్ కు కారణం అవుతోంది. గత ఇరవై నాలుగు గంటల్లో బుక్ మై షో వేదికగా లక్షా పదివేలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం చూస్తుంటే వీకెండ్ మరింత బలంగా ఉండటం ఖాయం. రేపు ఆదివారం కనక సాలిడ్ రన్ దొరికితే వేగంగా బ్రేక్ ఈవెన్ దాటేసే ఛాన్స్ ఉంది.

వసూళ్ల లెక్కలు గట్రా ఇంకా టీమ్ ప్రకటించలేదు కానీ డబుల్ డిజిట్ గ్రాస్ వచ్చి ఉంటుందని ట్రేడ్ రిపోర్ట్. సోమవారం నుంచి కూడా ఇదే హోల్డ్ కొనసాగిస్తే హిట్టు క్యాటగిరీలో ఈజీగా పడిపోతుంది. మా ఇంటి బంగారం, లెనిన్ తర్వాత థియేటర్లలో జనాన్ని చూపిస్తున్న సినిమా ప్రస్తుతం చెన్నై లవ్ స్టోరీ ఒకటే. శ్రీగౌరి ప్రియకు తగిన గుర్తింపు లభించింది. మణిశర్మ సంగీతం మరో ప్లస్ అయ్యింది. ఇదంతా ఎలా ఉన్నా స్టీవెన్ శంకర్ గా కిరణ్ అబ్బవరం డబుల్ ప్రమోషన్ దక్కించుకున్నాడు. 

This post was last modified on July 25, 2026 12:00 pm

Share

Recent Posts

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

2 hours ago

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

4 hours ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

5 hours ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

7 hours ago

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

7 hours ago

రామాయణ అలసత్వం వల్ల ఎవరికి లాభం

సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…

9 hours ago