Movie News

రణబాలి… వస్తే ఆశ్చర్యపోవాలి

విజయ్ దేవరకొండకు 2026 ఎంతో కీలకమైన సంవత్సరం. చాలా ఏళ్ల నుంచి సరైన విజయం లేని అతను.. ఈ ఏడాది ఆరంభంలో రెండు ఇంట్రెస్టింగ్ చిత్రాలను పట్టాలెక్కించాడు. అవే.. రణబాలి, రౌడీ జనార్ధన. వరుస ఫ్లాపుల ప్రభావం ఏమాత్రం లేని విధంగా ఈ చిత్రాలకు క్రేజీ కాంబినేషన్లు సెట్ అయ్యాయి. మొదట్లోనే మంచి హైప్ క్రియేట్ అయింది. ముఖ్యంగా ‘రణబాలి’ చాలా ప్రత్యేకమైన సినిమాలా కనిపిస్తోంది.

ట్యాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ చిత్రాలతో మెప్పించిన రాహుల్ సంకృత్యన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్యాక్ డ్రాప్, ప్రి గ్లింప్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయి. విజయ్ భార్య రష్మిక మందన్నా ఇందులో కథానాయికగా నటిస్తుండడం స్పెషల్ ఎట్రాక్షన్. మైత్రీ మూవీ మేకర్స్ విజయ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో ఈ సినిమాను నిర్మిస్తోంది.

ఐతే ఈ సినిమాకు అన్నీ బాగానే కుదిరినా.. చెప్పిన డేటుకు రిలీజ్ చేయడమే సవాలుగా మారింది. సెప్టెంబరు 11న ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. ఐతే భారీ బడ్జెట్, పీరియడ్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కిన సినిమా కావడం వల్ల టీం ఎంత కష్టపడుతున్నప్పటికీ షూటింగ్‌ అనుకున్నట్లు అవ్వట్లేదని సమాచారం. విడుదలకు ఇంకో 50 రోజులే సమయం ఉండగా.. ఇంకా టాకీ పార్ట్ చాలానే పెండింగ్ ఉంది. ఇంకో నెల తర్వాత కూడా షూట్ పూర్తయ్యే అవకాశం లేదని సమాచారం.

పాన్ ఇండియా స్థాయిలో పెద్దగా రిలీజ్ చేయాలనుకుంటున్న చిత్రానికి ఆగస్టు చివరికల్లా ఫస్ట్ కాపీ రెడీ చేసే పరిస్థితి ఉండాలి. కానీ అప్పటికి షూట్ పూర్తి కావడం కూడా ఆశ్చర్యమే అంటున్నారు. కాబట్టి ఈ చిత్రం వాయిదా పడగం అనివార్యం అంటున్నారు. ఇది లేటైతే డిసెంబరులో ‘రౌడీ జనార్దన’ విడుదల కావడం కూడా అనుమానమే. అయినా ఈ రోజుల్లో పెద్ద బడ్జెట్ సినిమాలు చెప్పిన డేటుకు వస్తే ఆశ్చర్యపోవాలి కానీ.. వాయిదా అంటే ఎవ్వరూ షాకయ్యే పరిస్థితి లేదు.

This post was last modified on July 22, 2026 4:11 pm

Share

Recent Posts

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

22 minutes ago

పెద్ద గండం దాటేసిన రణబాలి

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…

51 minutes ago

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

3 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

5 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

6 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

6 hours ago