పూజా హెగ్డే పేరుకు ఉత్తరాది హీరోయినే కానీ.. ఆమె ఎక్కువ సినిమాలు చేసింది సౌత్‌లోనే. ముఖ్యంగా తెలుగులో ఆమె ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది. తెలుగులో కెరీర్ ఆరంభంలో చేసిన ముకుంద, ఒక లైలా కోసం లాంటి చిత్రాలు నిరాశపరిచినా.. ‘దువ్వాడ జగన్నాథం’తో బ్రేక్ అందుకున్న ఆమె.. చూస్తుండగానే పెద్ద రేంజికి ఎదిగిపోయింది.
అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో లాంటి ఘనవిజయాలతో ఆమె దూసుకెళ్లింది. కానీ ఆమె కెరీర్లో పతాక దశ ఎక్కువ కాలం కొనసాగలేదు. వరుస ఫ్లాపులు ఆమెను వెనక్కి లాగేశాయి. ఎంత వేగంగా పైకి ఎదిగిందో.. అంతే వేగంగా కింద పడిపోయింది. దాదాపు మూడేళ్ల పాటు తెలుగులో ఆమెకు సినిమానే లేని పరిస్థితి తలెత్తింది. ‘గుంటూరు కారం’ నుంచి తప్పించాక.. తెలుగులో ఇంకో అవకాశమే అందుకోలేకపోయింది పూజా.
దుల్కర్ సల్మాన్ నటిస్తున్న బహు భాషా చిత్రం ‘శ్రీశ్రీ’లో అవకాశం అందుకున్నప్పటికీ.. ఫక్తు తెలుగు సినిమాలో, తెలుగు హీరో సరసన ఆమెకు అవకాశం దక్కలేదు. ఐతే ఇప్పుడామె మాస్ రాజా రవితేజకు జోడీగా నటించబోతున్నట్లు సమాచారం. హాసిత్ గోలి దర్శకత్వంలో దిల్ రాజు ప్రొడక్షన్లో రవితేజ, శ్రీ విష్ణు కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ మాస్, కామెడీ ఎంటర్టైనర్లో పూజా హెగ్డే.. రవితేజకు జంటగా నటించనుందట. శ్రీ విష్ణు సరసన కథానాయికను ఫైనలైజ్ చేయాల్సి ఉంది. రవితేజతో పూజా నటించనుండడం ఇదే తొలిసారి. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ఆలోచన ఉంది కానీ.. అప్పటికి సినిమా రెడీ కావడం కష్టమే.
This post was last modified on July 22, 2026 3:04 pm
ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…
మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…
ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…