Movie News

విజయ్ అడిగితే ఏదైనా ఇచ్చేయమన్న రావిపూడి

తమిళంలో నంబర్ వన్ హీరో స్థానంలో ఉండగా సినిమాలకు టాటా చెప్పేసి రాజకీయాల్లోకి వెళ్లిపోయాడు విజయ్. వెళ్తూ వెళ్తూ ఆయన చేసిన చివరి చిత్రం.. జననాయగన్. ఇది నందమూరి బాలకృష్ణ నటించిన హిట్ సినిమా ‘భగవంత్ కేసరి’కి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. కాకపోతే ఉన్నదున్నట్లు తీయకుండా మెయిన్ కాన్సెప్ట్, ముఖ్యమైన ఎపిసోడ్లను తీసుకుని.. మార్పులు చేర్పులు చేశాడు దర్శకుడు హెచ్.వినోద్.

ఐతే ఒరిజినల్‌ నుంచి ఎంత తీసుకున్నా సరే.. రీమేక్ రైట్స్ అయితే తీసుకోక తప్పదు కదా. అందుకోసం తనను ‘జననాయగన్’ టీం ఎలా సంప్రదించిందో.. ‘భగవంత్ కేసరి’ విషయంలో విజయ్ తనను ఎలా అభినందించాడో.. రీమేక్ రైట్స్ కోసం అడిగినపుడు తాను ఎలా స్పందించానో ఈ చిత్ర నిర్మాత కె.నారాయణతో కలిసి చేసిన ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో దర్శకుడు అనిల్ రావిపూడి వెల్లడించాడు.

‘‘వెంకట్ ప్రభు గారి దర్శకత్వంలో విజయ్ గారు నటించిన ‘ది గోట్’ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతున్నపుడు విజయ్ గారి టీం నుంచి నాకు కాల్ వచ్చింది. ఆయన నన్ను కలవాలనుకుంటున్నట్లు చెప్పడంతో చాలా ఎగ్జైట్ అయి వెళ్లాను. కారవాన్‌లో 15 నిమిషాలు ఆయనతో గడిపాను. అప్పుడు తాను ‘భగవంత్ కేసరి’ సినిమా చూశానని.. అందులో కొన్ని అంశాలు చాలా నచ్చాయని చెప్పారు. నేను చాలా సంతోషించాను. తర్వాత కొన్ని నెలలకు కేవీఎన్ ప్రొడక్షన్స్ నుంచి కాల్ వచ్చింది. ‘భగవంత్ కేసరి’లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తీసుకుని కొత్త కథతో విజయ్ గారు సినిమా చేయాలనుకుంటున్నట్లు చెప్పారు.

ఎన్ని సీన్లు తీసుకున్నా రీమేక్ రైట్స్ తీసుకోవాల్సిందే కాబట్టి.. దాని కోసం సంప్రదించారు. నేను ఆ మాట వినగానే ‘భగవంత్ కేసరి’ నిర్మాత సాహు గారికి ఫోన్ చేసి విజయ్ గారి కోసం ఏది అడిగితే అది ఇచ్చేయండి. ముందు ఓకే చెప్పండి. డీల్ గురించి తర్వాత అని చెప్పేశాను. నా సినిమా నుంచి సగం తీసుకున్నా, పావు తీసుకున్నా ఓకే. నా సినిమా విజయ్ గారికి నచ్చి అందులో సీన్లు తీసుకోవాలనుకోవడమే చాలా సంతోషాన్నిచ్చే విషయం’’ అని అనిల్ వెల్లడించాడు. ‘జననాయగన్’ ఈ గురువారమే తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

This post was last modified on July 22, 2026 2:48 pm

Share

Recent Posts

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

1 hour ago

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

2 hours ago

పెద్ద గండం దాటేసిన రణబాలి

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…

2 hours ago

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

5 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

7 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

7 hours ago