Movie News

నాగార్జున ఒడిస్సీ లెక్కలు వింటారా

లెనిన్ మరో సక్సెస్ మీట్ ఇవాళ జరిగింది. అఖిల్, నాగార్జున రావడంలో ఆశ్చర్యం లేదు కానీ ఈసారి నాగచైతన్య తోడవ్వడంతో మరింత అట్రాక్షన్ జత కూడింది. ఈ సందర్భంగా నాగ్ మాట్లాడుతూ ఒడిస్సి లాంటి పెద్ద సినిమా ఏడాది ముందే రిలీజ్ డేట్ ఇచ్చి దానికి కట్టుబడ్డారని, కానీ తనతో సహా టాలీవుడ్ లో అధిక శాతం నిర్మాణ సంస్థలు మాట మీద నిలబడలేక వాయిదాలు వేస్తున్నారని,. కనీసం రెండు వారాల ముందు ఫైనల్ కాపీ ఇస్తే బాగుంటుందనే తరహాలో సలహాలు సూచనలు ఇచ్చారు.

మాములుగా వివరించినట్టు అనిపించినా నాగార్జున చెప్పింది చాలా సీరియస్ ఇష్యూ. ఎందుకంటే చాలా ఏళ్లుగా ప్యాన్ ఇండియా మూవీస్ విపరీతమైన జాప్యానికి గురవుతున్నాయి. కనీసం నాలుగైదు రిలీజ్ డేట్లు మారకుండా ఏది బయటికి రావడం లేదు. అనిల్ రావిపూడి లాంటి ఒకరిద్దరు మినహాయించి ఎవరూ టార్గెట్ రీచ్ కాలేకపోతున్నారు. దీనికి అందరూ బాధ్యులే. వేల కోట్లతో తీసిన ఒడిస్సి అంత గ్యారెంటీగా విడుదల తేదీని అందుకున్నప్పుడు మనం మాత్రం ఎందుకు చేయలేం.

నిజంగా నిర్మాతలు కొన్ని గైడ్ లైన్స్ పెట్టుకోవడం అవసరం అనిపిస్తోంది. ఒకప్పుడు స్టార్ హీరోలు ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేయడానికి కారణం ఒకటే. బడ్జెట్ కంట్రోల్ లో ఉండటం, ఇచ్చిన ప్లానింగ్ కు తగ్గట్టు దర్శకులు ఎలాంటి ఆలస్యం చేయకుండా ప్రోడక్ట్ సిద్ధం చేయడం. కానీ ఇప్పుడలాంటి పరిస్థితులు లేవు. అంతా స్వయంకృతాపరాధంగా మారిపోయింది. కనీసం రెండు సంవత్సరాలు తీయకపోతే అదో అవమానంగా ఫీలవుతున్న డైరెక్టర్లు లేకపోలేదు.

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే పోస్ట్ ప్రొడక్షన్ కాకుండా ఒడిస్సికి తీసుకున్న షూటింగ్ డేస్ తొంభై మూడు రోజులు. ఇక్కడ మూడు నెలల్లో ఒక షెడ్యూల్ తీస్తే గగనం అనుకోవాలి. ఇలాంటి వాటిలో మార్పు రావాలి. లేదంటే నిర్మాతల జేబులకు చిల్లులు పడుతూనే ఉంటాయి. మూడు పాత్రలు పోషించి నిర్మాణం ప్లస్ దర్శకత్వం వహించిన దానవీరశూరకర్ణని ఎన్టీఆర్ అతి తక్కువ రోజుల్లో తీసిన రికార్డు ఇప్పటికీ భద్రంగా ఉంది. మరీ అంత వేగంగా కాకపోయినా కనీస స్థాయిలో స్పీడ్ పెంచాల్సిన అవసరమైతే చాలా ఉంది.

This post was last modified on July 20, 2026 10:20 pm

Share

Recent Posts

ఇకపై జగన్ రోజూ కోర్టుకు వెళ్లాల్సిందేనా

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత అక్రమాస్తుల కేసులో ఈడీ స్పీడ్ పెంచడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఉన్నట్టుండి…

10 minutes ago

టాలీవుడ్ స్టార్లు ఆ మాయలో పడి నష్టపోతున్నారా

మన టాలీవుడ్ స్టార్లు ఇప్పుడు లోకల్ మార్కెట్ ను దాటేసి అంతకుమించి అనేలా అడుగులు వేస్తున్నారు. నార్త్ ఆడియన్స్ తో…

3 hours ago

అబ్బవరం ఈసారి బయటపడగలడా?

యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నుంచి ఒక టైంలో వచ్చిన సినిమాలు చూస్తే.. తన పనైపోయిందనే అనిపించింది. ఐతే కెరీర్…

4 hours ago

అసలు ఈ మస్క్ వివాదం ఏంటి?

గ‌త రెండు రోజులుగా ఇటు సోష‌ల్ మీడియాలోను, అటు ప్ర‌ధాన మీడియా ఛానెళ్ల‌లోను.. తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం.. ప్ర‌పంచ…

9 hours ago

బడ్జెట్ రూ. 2 కోట్లు కలెక్షన్లు 50 కోట్లు…

పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా…

10 hours ago

కొడతావా… కొట్టుకో

ఎన్నికల కమిషన్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు చేస్తున్న ఆందోళనతో దేశ…

10 hours ago