ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి… అంచెలంచెలుగా ఎదుగుతూ మెగాస్టార్‌గా ఎదిగారు చిరంజీవి. మూడు దశాబ్దాల పాటు టాలీవుడ్‌లో ఏకచక్రాధిపత్యం సాగించిన చిరూకి ఆ రేంజ్ క్రేజ్, ఫాలోయింగ్ రావడానికి ఆయన క్యారెక్టర్ కూడా ఓ కారణం. రీఎంట్రీ తర్వాత సోషల్ మీడియాలోనూ ఓ ఆటాడుకుంటున్న మెగాస్టార్ మరోసారి తన ఉదారతను చూపించి, టాలీవుడ్ జనాల మనసులు గెలుచుకున్నారు.
కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆచార్య’ సినిమాలో మొదట హీరోయిన్‌గా త్రిషను ఎంచుకున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులు షూటింగ్ చేసిన తర్వాత మెగా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించి, మెగా టీమ్‌కు షాక్ ఇచ్చింది త్రిష.
‘తనకు చెప్పిన స్క్రిప్ట్ ఒకటి, తీస్తున్నది ఒక్కటి’ అంటూ కొరటాల శివపై, మెగాస్టార్‌పై సెటైరికల్ కామెంట్లు కూడా చేసింది త్రిష. త్రిష అర్ధాంతరంగా తప్పుకోవడంతో ఆమె స్థానంలో హీరోయిన్ కాజల్ అగర్వాల్‌ను ఎంపిక చేసింది ‘ఆచార్య’ యూనిట్.
తన సినిమా నుంచి సడెన్‌గా తప్పుకున్నా, అవేమీ మనసులో పెట్టుకోకుండా త్రిషకు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్. ‘సంతోషం, విజయం నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని’ త్రిషకు విషెస్ తెలిపారు. మే 4న జన్మించిన త్రిష, తన 37వ పుట్టినరోజు జరుపుకుంటోంది.
This post was last modified on May 5, 2020 1:06 pm
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
వైసీపీ తీరు మారలేదు. ఒకవైపు.. ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు…
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…