Movie News

రావణుడి భుజాల మీద గెడ్డం బరువు

రామాయణం మనం ఇప్పటికే కొన్ని వందలసార్లు చూసుంటాం. ఎందరో మహానటులు ఈ అద్భుత కావ్యంలో పాత్రలు పోషించి చిరస్మరణీయలుగా నిలిచిపోయారు. అందుకే ఎన్నిసార్లు తీయాలని పూనుకున్నా జనం వీటి పట్ల ఆసక్తి చూపిస్తూనే ఉంటారు. అలాంటిది నాలుగు వేల కోట్లతో ఈ ఇతిహాసం తెరకెక్కుతోందంటే అంతకన్నా ఎగ్జైట్ మెంట్ ఏముంటుంది. నవంబర్ 8 విడుదల కాబోయే ఈ విజువల్ వండర్ కోసం ప్రేక్షకులు విపరీతమైన ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

ఇక అసలు విషయానికి వస్తే రామాయణలో రావణుడిగా యష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న తన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. మాములుగా రావణుడంటే మన మనసులో ఒక ముద్ర ఉంది. భూకైలాస్, సంపూర్ణ రామాయణం, సీతా కళ్యాణం, బాల రామాయణం ఇలా ఏ క్లాసిక్ చూసినా వాటిలో రావణుడికి గెడ్డం ఉండదు. దర్శకులు ఆయనకు బారుడు మీసాలు పెట్టారు కానీ ఎవరూ గుబురు గెడ్డం అతికించే సాహసం పొరపాటున కూడా చేయలేదు.

ఆదిపురుష్ లో సైఫ్ అలీ ఖాన్ కి గెడ్డం ఉండటమే ఆర్టిఫీషియల్ లుక్ తెచ్చి పెట్టింది. ఇప్పుడు యష్ ఈ విషయంలో నెలకొన్న నెగటివిటీని దాటి చూపించాలి. నిజానికి దర్శకుడు నితేశ్ తివారి ముందు అనుకున్న గెటప్ గెడ్డం లేకుండానే ఉందట. కానీ టాక్సిక్ షూటింగ్ సమాంతరంగా జరుగుతున్న టైంలో తాను లుక్ మార్చే పరిస్థితిలో లేనని యష్ స్పష్టం చేయడంతో అలాగే కొనసాగించాల్సి వచ్చిందని ఇన్ సైడ్ టాక్. ఏదైనా ఇంటర్వ్యూలో దీని ప్రస్తావన వస్తుందేమో చూడాలి.

యష్ చాలా పెద్ద ఛాలెంజ్ ఎదురుకోబోతున్నాడు. ఎందుకంటే కెజిఎఫ్ అంత ఇమేజ్ తీసుకొచ్చిన తర్వాత రావణుడి లాంటి నెగటివ్ క్యారెక్టర్ చేయడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. రెండో భాగంలో రాముడిగా నటించిన రన్బీర్ కపూర్ చేతిలో యష్ ప్రాణాలు కోల్పోవడాన్ని ఊహించుకోలేకపోతున్నారు. అయితే ఇవన్నీ కేవలం అంచనాల వరకేనని, తెరమీద సినిమా చూశాక అన్ని అనుమానాలు పటాపంచలవుతాయని యూనిట్ నమ్ముతోంది. 24 వచ్చే ట్రైలర్ తో  కొంత సమాధానం దొరకొచ్చు. 

This post was last modified on July 20, 2026 5:45 pm

Share

Recent Posts

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

2 hours ago

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

3 hours ago

పెద్ద గండం దాటేసిన రణబాలి

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…

3 hours ago

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

6 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

8 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

8 hours ago