Trends

ఫిఫా ఫైనల్… దండగ అన్నవాడే గెలిపించాడు

2026 ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌ ఊహించని ట్విస్టులతో ముగిసింది. అర్జెంటీనాతో జరిగిన ఈ చారిత్రాత్మక పోరులో ఎవరో ఊహించని ప్లేయర్ స్పానిష్ జట్టుకు అసలైన హీరోగా మారాడు. టోర్నీ అంతటా దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొని, అసలు ఇతను జట్టులో దండగ అనే రేంజ్‌లో విమర్శలు మూటగట్టుకున్న బార్సిలోనా ఫార్వర్డ్ ఫెరాన్ టోర్రెస్, ఎక్స్‌ట్రా టైమ్‌లో సంచలన గోల్‌తో మెస్సీ ఆర్మీ ఆశలను దెబ్బతీసి స్పెయిన్‌ను జగజ్జేతగా నిలబెట్టాడు.

నిజానికి 90 నిమిషాల రెగ్యులర్ టైమ్‌లో స్పెయిన్ మొత్తం 15 షాట్లతో అర్జెంటీనాపై పదే పదే దాడి చేసినా, ప్రత్యర్థి కీపర్ మార్టినెజ్ అడ్డుగోడలా నిలబడటంతో మ్యాచ్ గోల్స్ లేకుండానే సాగింది. అయితే సెకండ్ హాఫ్ అదనపు సమయంలో అర్జెంటీనా డిఫెండర్ ఎంజో ఫెర్నాండెజ్ రెడ్ కార్డ్ వలన మైదానం వీడటం ఆ జట్టును కోలుకోలేని దెబ్బ తీసింది. ఆపై ఎక్స్‌ట్రా టైమ్ మొదలైన 37 సెకన్లకే అంటే 106 వ నిమిషంలో పెడ్రో పోర్రో, నికో విలియమ్స్ సాయంతో టోర్రెస్ తన ఎడమ కాలితో బంతిని నెట్‌లోకి పంపి 1-0 తో మ్యాచ్‌ను ముగించాడు.

ఈ 26 ఏళ్ల ఫెరాన్ టోర్రెస్ ప్రయాణం అంత సులువుగా ఏమీ సాగలేదు. వాలెన్సియా, మాంచెస్టర్ సిటీ లాంటి క్లబ్స్ తరపున ఆడి, 2022 లో బార్సిలోనాలో చేరిన ఈ యంగ్ ప్లేయర్ తన ఫినిషింగ్ విషయంలో ఎప్పుడూ విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నాడు. గత 2024-25 సీజన్‌లో బార్సిలోనా తరపున 49 మ్యాచ్‌లలో 21 గోల్స్ కొట్టి లా లిగా టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించినా, పెద్ద మ్యాచ్‌లలో అవకాశాలు చేజార్చుకుంటాడనే ముద్ర అతనిపై బలంగా పడింది.

ఈ వరల్డ్ కప్ టోర్నీలో కూడా సౌదీ అరేబియాతో మ్యాచ్‌లో అతను కొట్టిన గోల్‌ను వీఏఆర్ నిరాకరించడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు, నెట్టింట పెద్ద ఎత్తున ట్రోల్స్ చూశాడు. అందుకే ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న టోర్రెస్ మాట్లాడుతూ.. తనపై వచ్చిన విమర్శలన్నీ భరిస్తూ దేవుడిచ్చిన బలంతోనే ముందుకు సాగానని, నిజాయితీగా శ్రమించిన వారికే విజయం దక్కుతుందని ఎమోషనల్ అయ్యాడు.

ఈ విజయంతో స్పెయిన్ జట్టు ఒక సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఒకే సమయంలో అటు మెన్స్, ఇటు ఉమెన్స్ ఫిఫా వరల్డ్ కప్ టైటిల్స్ రెండింటినీ తన ఖాతాలో వేసుకున్న ఏకైక దేశంగా స్పెయిన్ చరిత్ర సృష్టించింది. లెవాండోస్కీ వెళ్లిన తర్వాత కూడా బార్సిలోనా యాజమాన్యం టోర్రెస్‌ను నమ్మలేదు. అతని స్థానంలో వేరే స్ట్రైకర్ కోసం వెతుకులాట ప్రారంభించింది. కానీ టోర్రెస్ కు కాస్త లక్కు కలిసొచ్చింది. వరల్డ్ కప్ ఫైనల్‌లో మెస్సీ టీమ్‌పై సంచలన గోల్ కొట్టి చరిత్ర సృష్టించాడు. ఈ దెబ్బతో తన సామర్థ్యం ఏంటో చూపించి ఆ క్లబ్ మేనేజ్మెంట్‌కు గట్టి సమాధానం ఇచ్చాడు.

This post was last modified on July 20, 2026 8:16 pm

Share

Recent Posts

మ‌మిత అస‌లు పేరు అది కాదా?

మ‌మిత బైజు.. ఇప్పుడు సౌత్ ఇండియ‌న్ సినిమాలో ఒక సంచ‌లనం. కొన్నేళ్ల ముందు ప్రేమ‌లు సినిమాతో మ‌ల‌యాళీల‌తో పాటు ఇత‌ర…

17 minutes ago

జగన్ కు ఎవరైనా చెబితే బాగుండు

ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయినా సరే 40 శాతం ఓటు బ్యాంకు ఉన్న పార్టీకి అధ్యక్షుడు…

41 minutes ago

స్టార్ సినిమా శ్రీలీలకే దక్కింది

తెలుగు సినిమాల్లోకి ఒక ఉప్పెనలా దూసుకొచ్చిన హీరోయిన్ శ్రీలీల. ఆమె తెలుగమ్మాయే అయినప్పటికీ కర్ణాటకలో పుట్టి పెరగడం వల్ల అక్కడే…

10 hours ago

పెళ్లి కోసం తపించిపోయేవాళ్ళు ఇంతమంది ఉన్నారా?

నాకు పెళ్ళెప్పుడవుతుంది బాబూ ... పిల్ల యాడ దొరుకుతుంది బాబోయ్ అనే సినిమా పాట పాడుకుంటున్నారు కేరళం యువకులు. అత్యధిక…

11 hours ago

రష్మిక తాండవం ఊహించలేదు

ర‌ష్మిక మంద‌న్నా కెరీర్లో ఎక్కువ‌గా స్టార్ హీరోల స‌ర‌స‌న క‌థానాయిక‌గానే న‌టించింది. ఈ మ‌ధ్యే ఆమె కూడా లేడీ ఓరియెంటెడ్…

11 hours ago

హైదరాబాద్ గడ్డపై విరుచుకుపడ్డ అమిత్ షా

తెలంగాణ‌లో ప‌ర్య‌టన‌కు వ‌చ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్ర‌నాయ‌కుడు అమిత్‌షా.. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కీల‌క…

11 hours ago