72వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటుడు అవార్డు పుష్ప 2కి గాను అల్లు అర్జున్ కి మరోసారి రావొచ్చేమో అని భావించిన అభిమానులు కొంత నిరాశ పడ్డారు. అయితే ఇలా ఆశించడం కూడా సరికాదు. ఎందుకంటే పుష్ప 1కి ఆ గుర్తింపు ఆల్రెడీ ఇచ్చేశారు. ఎర్రచందనం స్మగ్లర్ పాత్రలో బన్నీ చూపించిన విశ్వరూపానికి సత్కారం అందించారు. టాలీవుడ్ చరిత్రలో మొదటిసారి బెస్ట్ యాక్టర్ అవార్డు ఒక తెలుగు హీరో అందుకోవడమనే అరుదైన ఘనత బన్నీ ఖాతాలో చేరింది.
ఎలా చూసుకున్నా ఉత్తమ నటుడి గౌరవం మరోసారి బన్నీకి ఇవ్వడం సాధ్యం కాదు. కమిటీకి సంబంధించిన గైడ్ లైన్స్ లో వీటికి సంబంధించిన మార్గదర్శకాలు ఉంటాయి. పుష్ప 2 మొదటి భాగానికి కొనసాగింపు. కథ పొడిగించారు తప్ప హీరో క్యారెక్టరైజేషన్ మారలేదు. జాతర ఎపిసోడ్ లో డాన్స్ అద్భుతంగా చేసినా, క్లైమాక్స్ లో రౌద్ర రూపం చూపించినా అవన్నీ కమర్షియల్ టెంప్లేట్ లో భాగంగా దర్శకుడు సుకుమార్ డిజైన్ చేసుకున్నవి. సో పదే పదే ఇవ్వడం జరగదు.
చందూ ఛాంపియన్ కు ఆ అవార్డు దక్కడం సబబే. కార్తీక్ ఆర్యన్ నిజంగానే అంతగా కష్టపడ్డాడు. రామ్ చరణ్ పెద్దికి ఇన్స్ పిరేషన్ ఇచ్చిన సినిమాల్లో ఇదీ ఒకటి. అందుకే తనకు ఇవ్వడంలో న్యాయం ఉంది. నిజానికి పుష్ప 1కి బెస్ట్ యాక్టర్ ఇచ్చినప్పుడే కొన్ని కామెంట్స్ వచ్చాయి. స్మగ్లర్ పాత్రలకు ఎలా ఇస్తారని కొందరు నిలదీశారు. విచిత్రంగా ఇంత పెద్ద ఘనత సాధించిన అల్లు అర్జున్ కు ఇండస్ట్రీ వైపు నుంచి, మా అసోసియేషన్ నుంచి ఎలాంటి ప్రత్యేక సన్మానం దక్కలేదు.
ఇవన్నీ అలా ఉంచితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం జాతీయ అవార్డులను కొలమానంగా తీసుకుని ఒక సినిమా స్థాయిని డిసైడ్ చేయలేం. ఆ మాటకొస్తే ఆస్కార్ రాలేదని బాహుబలిని తక్కువ చేసి చూడగలమా. ప్యాన్ ఇండియా అనే పదాన్ని సృష్టించిందే ఆ సినిమా. శంకరాభరణం, స్వాతిముత్యం లాంటి క్లాసిక్స్ లో నటనకు సోమయాజులు, కమల్ హాసన్ కూడా వాటిని దక్కించుకుని ఉండాలి. సో బన్నీకి సెకండ్ టైం వచ్చినా రాకపోయినా పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు.
This post was last modified on July 18, 2026 9:43 pm
దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా,…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్.. మంగళవారం సాయంత్రం విజయవాడలో పర్యటించేందుకు వచ్చారు. తొలుత కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించుకున్న ఆయన.. అనంతరం..…
ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…
తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…
వంగవీటి రంగా వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన కుమారుడు వంగవీటి రాధా.. త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటారన్న…