కేజీఎఫ్ ట్రీట్ అనుకున్న దాని కంటే ముందే వచ్చేసింది. శుక్రవారం యశ్ పుట్టిన రోజు సందర్భంగా ఉదయం 10 గంటల 18 నిమిషాలకు టీజర్ రిలీజవుతుందని ప్రకటించారు. కానీ టీజర్ ముందే సోషల్ మీడియాలో లీక్ అయిపోవడంతో గురువారం రాత్రే టీజర్‌ను వదిలేశారు. ఈ సడెన్ సర్ప్రైజ్ చూసిన జనాలకు మతులు పోయాయి. ‘కేజీఎఫ్-2’ టీజర్ మీద మంచి అంచనాలే ఉన్నాయి కానీ.. ఆ అంచనాల్ని మించిపోయే విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్.. అన్నింటికీ మించి చివర్లో కొసమెరుపులా ఉన్న హీరో ఎలివేషన్ సీన్‌తో జనాలకు దిమ్మదిరిగిపోయింది.
రాకీ మెషీన్ గన్నుతో కార్లను అమాంతం లేపేయడం.. తర్వాత ఆ గన్నుకున్నమంట నుంచే సిగరెట్ అంటించుకోవడం చూసి మాస్‌కు పూనకాలు వచ్చేశాయి. వామ్మో ఇదేం మాస్‌రా అయ్యా అంటూ నెటిజన్లు ఈ టీజర్ మీద కామెంట్లు పెడుతున్నారు.
ఇండియన్ సినిమాలో హీరో ఎలివేషన్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన సినిమా ‘కేజీఎఫ్’. కన్నడ భాషను దాటితే మిగతా వాళ్లందరికీ యశ్ కొత్త వాడు. అయినా సరే.. తమ దగ్గర ఒక సూపర్ స్టార్ సినిమా చూస్తున్న భావన కలిగేలా అందులో హీరో పాత్రను ఎలివేట్ చేశాడు ప్రశాంత్ నీల్. ఆ సినిమాతో యశ్‌కు బాగా అలవాటు పడ్డారు ప్రేక్షకులు. ఇప్పుడు భారీ అంచనాలతో ‘కేజీఎఫ్-2’ చూడబోతున్నారు. వాళ్లందరినీ రాకీ పాత్ర మరింతగా ఉర్రూతలూగించడం, గూస్ బంప్స్ ఇవ్వడం గ్యారెంటీ అనిపిస్తోంది టీజర్ చూస్తే. ‘బాహుబలి: ది కంక్లూజన్’ ట్రైలర్ చూసినపుడు ఎలా అయితే గూస్ బంప్స్ కలిగాయో.. అలాంటి ఫీలింగే కలుగుతోంది జనాలకు టీజర్ చూస్తుంటే.
‘బాహుబలి: ది బిగినింగ్’ తర్వాత ‘ది కంక్లూజన్’ మీద ఏ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయో.. దాని కోసం ఎంతగా ప్రేక్షకులు ఎదురు చూశారో.. ఆ సినిమా ట్రైలర్ వచ్చినపుడు ఎంత ఎగ్జైట్ అయ్యారో గుర్తుండే ఉంటుంది. మళ్లీ ఓ సినిమా రెండో పార్ట్ మీద ఇలాంటి అంచనాలు మళ్లీ రాబోవనే అనుకున్నారు. కానీ ‘కేజీఎఫ్-2’ దానికి దగ్గరగా హైప్ తెచ్చుకుంటుందనే అనిపిస్తోంది ఈ టీజర్ చూశాక. ఇంకా మరిన్ని ప్రోమోలు వదిలితే.. ట్రైలర్ కూడా రిలీజైతే అంచనాలు ఇంకా పెరగడం ఖాయం. పాన్ ఇండియా స్థాయిలో ‘బాహుబలి-2’ తర్వాత దానికి దగ్గరగా నిలిచే చిత్రం ఇదే అయ్యేలా ఉంది. ఇక హీరో ఎలివేషన్, గూస్ బంప్స్ లాంటి విషయాలకు వస్తే ‘బాహుబలి-2’కు ఇది దీటుగా నిలిచేలాగానూ ఉంది.
This post was last modified on January 8, 2021 10:11 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…