నందమూరి కళ్యాణ్ రామ్ ‘రావణుడి’గా మారుతున్నాడా? వేణు మల్లిడి దర్శకత్వంలో స్వీయ నిర్మాణంలో కళ్యాణ్ రామ్ ఇప్పుడో పీరియడ్ సినిమా చేస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్టస్పై చాలా గ్యాప్ తర్వాత మళ్లీ కళ్యాణ్‍రామ్ చేస్తోన్న ఈ చిత్రం గురించి ఇండస్ట్రీలో గొప్పగా చెప్పుకుంటున్నారు. అరుదైన కథాంశంతో రూపొందే ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ రావణుడి తరహా పాత్రలో కనిపించబోతున్నాడని టాక్. దానికి బలం చేకూరుస్తూ వికీ పీడియాలో కూడా ‘రావణ్’ టైటిల్ అప్‍డేట్ చేసారు. అలాగే ‘తుగ్లక్’ అనే మరో పేరు కూడా ప్రచారం జరుగుతోంది.
టైమ్ మెషీన్ కాన్సెప్ట్తో చాలా డిఫరెంట్‍గా వుండే ఈ చిత్రం కోసం భారీగా గ్రాఫిక్స్ కూడా చేయాలట. కళ్యాణ్‍రామ్ మార్కెట్ కంటే రెండింతలు ఎక్కువే ఖర్చు పెడుతున్నారని, వీలయితే ఈ చిత్రాన్ని ఇతర భాషలలో కూడా విడుదల చేయాలని చూస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో కళ్యాణ్‍రామ్‍కి జోడీగా క్యాథరీన్ నటిస్తోందట. కళ్యాణ్‍రామ్ అడపాదడపా అతనొక్కడే. పటాస్ లాంటి సర్‍ప్రైజ్‍లు ఇచ్చాడు కనుక అతడి స్టోరీ జడ్జిమెంట్ అన్ని వేళలా రాంగ్ అవదు కనుక ఈ చిత్రం గురించి జరుగుతోన్న హైప్ అంతా నమ్మశక్యంగానే వుంది.
This post was last modified on January 8, 2021 2:14 am
హిందీ దృశ్యం 3 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి మూడు రోజుల వసూళ్లు 270 కోట్లకు పైగా నమోదు కావడం…
షూటింగ్ సమయంలో ప్రమాదం వల్ల గాయపడిన నందమూరి బాలకృష్ణ కోలుకున్నారు. సుమారు రెండు నెలలు విశ్రాంతిలో ఉండి మళ్ళీ సినిమాలతో…
దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి చేతిలో కేవలం పదకొండు రోజులు మాత్రమే ఉన్నాయి. ట్రైలర్…
భర్త మరో మహిళతో కారులో కనిపించాడు. అది చూసిన భార్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ భర్త కారు ఆపకుండా…
నిన్న ఉన్నట్టుండి ఆదర్శ కుటుంబం ఏకె 47 పండగ బరి నుంచి తప్పుకుందనే వార్త సోషల్ మీడియాని ఊపేసింది. ఇంకా…
స్వంత కుటుంబం సినిమా. కార్తికేయ నిర్మాతగా వ్యవహరించి పక్క భాషనుంచి ఫహద్ ఫాసిల్ ని తీసుకొచ్చి తీసిన మూవీ. పైగా…