ఇండియాలో ఇప్పటిదాకా వచ్చిన వెబ్ సిరీస్‌ల్లో బ్లాక్ బస్టర్ అంటే.. ‘ఫ్యామిలీ మ్యాన్’ అనే చెప్పాలి. ఉగ్రవాదుల కార్యకలాపాల్ని ఆపడం కోసం ఇంటలిజెన్స్ బ్యూరో చేసే సాహసాల నేపథ్యంలో అమేజాన్ ప్రైమ్ రూపొందించిన ఈ సిరీస్ తొలి సీజన్ సూపర్ హిట్టయింది.
లీడ్ రోల్‌లో మనోజ్ బాజ్‌పేయి సూపర్ పెర్ఫామెన్స్.. ప్రియమణి సహా మిగతా నటీనటుల ప్రతిభ.. రాజ్-డీకే దర్శకత్వం.. కథలోని భిన్న పార్శ్యాలు, ఉత్కంఠ.. ఇలా అన్నీ చక్కగా కుదిరి ఈ సిరీస్ భారతీయ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. తొలి సీజన్ అయిపోయినప్పటి నుంచి రెండో సీజన్ కోసం ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. ఏడాదికి పైగా ఎదురు చూపుల తర్ావత ఈ సిరీస్ రిలీజ్ డేట్ ఖరారు చేశారు మేకర్స్. ఫిబ్రవరి 12న ‘ఫ్యామిలీ మ్యాన్’ రెండో సీజన్ ప్రిమియర్స్ పడబోతున్నట్లు అమేజాన్ ప్రైమ్ ఒక వీడియో ద్వారా ప్రకటించింది.
రెండో సీజన్లో సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. సీజన్-2 ప్రోమోలో ఆమెకు తగిన ప్రాధాన్యమే దక్కింది. హీరో మనోజ్ బాజ్‌పేయిని ముందు పెట్టి బ్యాగ్రౌండ్లో సమంత రూపాన్ని చూపించేలా ఇందులోని కీలక ఘట్టాల్ని పొందుపరిచారు. ఇందులో సమంత ఉగ్రవాది పాత్రను పోషిస్తున్నట్లు ముందు నుంచి వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. మనోజ్‌కు భార్యగా ప్రియమణి నటించింది కాబట్టి సినిమాలో ఇతర కీలక పాత్ర అంటే.. విలన్‌దే అయ్యుండాలి. తొలి సీజన్లో మూసా పాత్ర ఎంతగా హైలైట్ అయ్యిందో తెలిసిందే.
ఆ పాత్ర తొలి సీజన్‌తోనే ముగిసిపోయింది కాబట్టి రెండో సీజన్లో సమంత మెయిన్ విలన్ పాత్ర పోషిస్తుందని అనుకోవచ్చు. ‘ఫ్యామిలీ మ్యాన్-1’లో కథను ముగించకుండా మధ్యలోనే వదిలేయడం తెలిసిన సంగతే. అక్కడి నుంచే కథను కొనసాగించబోతున్నారు. రెండో సీజన్లో విప్పాల్సిన ముడులు చాలానే ఉన్నాయి. మరి తొలి సీజన్ మాదిరే రెండో సీజన్ కూడా అంతే ఉత్కంఠభరితంగా, వినోదాత్మకంగా సాగి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందేమో చూడాలి.
This post was last modified on January 7, 2021 4:36 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…