Movie News

స‌మంత‌ను భ‌య‌పెట్టిన ఆ ఫోన్ కాల్

తెలుగులో ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీకి వంద కోట్ల వ‌సూళ్లు రావ‌డం అన్న‌ది అనూహ్య‌మే. అందులోనూ అది ఫ్యామిలీ సినిమా అయితే మ‌రింత ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌య‌మే. మా ఇంటి బంగారం మూవీతో స‌మంత ఈ గొప్ప ఘ‌న‌త‌నే సాధించింది. విడుద‌ల‌కు ముందు పెద్ద‌గా అంచ‌నాలు లేని ఈ చిత్రం.. రిలీజ్ రోజు ఒక మోస్త‌రు టాకే తెచ్చుకుంది. 

కానీ రిలీజ్ టైమింగ్ క‌లిసి రావ‌డం.. ఫ్యామిలీ ఆడియ‌న్స్ క‌లిసి రావ‌డం.. స‌మంత స్టార్ ప‌వ‌ర్.. అన్నీ తోడై సినిమా ఎవ్వ‌రూ ఊహించని స్థాయికి వెళ్లిపోయింది. తొలి వీకెండ్ మెరుపుల‌కు ప‌రిమితం కాకుండా.. లాంగ్ ర‌న్‌తో ఏకంగా వంద కోట్ల గ్రాస్ వ‌సూళ్ల క్ల‌బ్బులోకి అడుగుపెట్టింది. ఐతే రిలీజ్‌కు ముందు ఈ సినిమా ఈ స్థాయిలో విజ‌యం సాధిస్తుంద‌ని స‌మంత కూడా న‌మ్మ‌లేద‌ట‌. ఆమె భ‌యాల గురించి ద‌ర్శ‌కురాలు నందిని రెడ్డి, నిర్మాత రాజ్ నిడిమోరు ఇంత‌కుముందే వెల్లడించారు.

ఇప్పుడీ సినిమా వంద కోట్ల క్ల‌బ్బులో అడుగుపెట్టిన నేప‌థ్యంలో సమంత స్వ‌యంగా రిలీజ్‌కు ముందు టెన్ష‌న్ గురించి వెల్ల‌డించింది. ఒక డిస్ట్రిబ్యూట‌ర్‌తో ఫోన్ కాల్ త‌న‌నెంత టెన్ష‌న్ పెట్టిందీ స‌మంత వివ‌రించింది. స‌మంత ప‌క్క‌నే ఉండ‌గా.. ఆమె ఫ్రెండ్ ఒక‌రు ఒక డిస్ట్రిబ్యూట‌ర్‌కు ఫోన్ చేసి మా ఇంటి బంగారం సినిమా ఎలా ఆడొచ్చు, ప్రేక్ష‌కులు ఈ సినిమా చూస్తారా అని అడిగార‌ట‌. దానికా డిస్ట్రిబ్యూట‌ర్ బ‌దులిస్తూ.. ఈ రోజుల్లో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ ఎవ‌రు చూస్తారు, ఈ సినిమా ఆడ‌ద‌న్న‌ట్లుగా మాట్లాడాడ‌ట‌. 

ఒక హీరోయిన్ ఒక స్టార్ హీరో సినిమాలో గ్లామ‌ర్ రోల్ చేస్తే థియేట‌ర్ల‌కు వ‌స్తారేమో కానీ.. ఇలాంటి సినిమాలు జ‌నం చూడ‌ర‌ని అత‌ను తేల్చేశాడ‌ట‌. ఐతే మా ఇంటి బంగారం ఇంత పెద్ద విజ‌యం సాధించిన నేప‌థ్యంలో ఇక‌పై ఆ డిస్ట్రిబ్యూట‌ర్ స‌హా ఎవ‌రూ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ గురించి ఇలా మాట్లాడ‌ర‌ని.. క‌నీసం ఏం జ‌రుగుతుందో చూద్దాం అని అంటార‌ని స‌మంత వ్యాఖ్యానించింది.

This post was last modified on July 13, 2026 10:46 am

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

4 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

6 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

7 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

7 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

7 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

7 hours ago