టాలీవుడ్ యంగ్ స్టార్స్ పర్సనల్ లైఫ్ లో జరిగిన మార్పులు, ఆ వెంటనే వారు అందుకున్న సక్సెస్ లపై నెటిజన్లు రకరకాల పోలికలు వెలికితీస్తున్నారు. పెళ్లి, లైఫ్ పార్ట్నర్ ఎంట్రీ తర్వాత హీరోల కెరీర్ లో సరికొత్త కంబ్యాక్స్ కనిపిస్తున్నాయంటూ సోషల్ మీడియాలో మీమ్స్ తెగ హల్ చల్ చేస్తున్నాయి. లైఫ్ లో కొత్త చాప్టర్ స్టార్ట్ కావడం అనేది ప్రొఫెషనల్ లైఫ్ కి ఒక రకంగా పాజిటివ్ ఎనర్జీని ఇస్తోందనే కామెంట్లు గట్టిగా వినిపిస్తున్నాయి.
కెరీర్ లో కొన్ని వరుస అప్ అండ్ డౌన్స్ చూసిన ఈ యంగ్ హీరో, రహస్య గోరఖ్‌ను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ‘క’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి రిజల్ట్ రాబట్టింది. రొటీన్ కథల జోలికి వెళ్లకుండా చేసిన ఆ కొత్త ప్రయోగం థియేటర్లలో వర్కవుట్ అవ్వడం, అతనికి నటుడిగా ఒక బలమైన రీ ఎంట్రీని ఇచ్చింది. మరోవైపు అక్కినేని నాగచైతన్య కెరీర్ గ్రాఫ్ లోనూ ఇలాంటి పోలికే కనిపిస్తోంది. శోభితా ధూళిపాళ్లతో వివాహం జరిగిన తర్వాత చైతూ తన లైనప్ లో గట్టి మార్పులే చేశాడు. గత ఏడాది రిలీజైన ‘తండేల్’ చిత్రంతో మొదటిసారి 100 కోట్లను టచ్ చేశాడు.
ఇక సమంత పర్సనల్ లైఫ్ లో వచ్చిన చేంజ్ కూడా కలిసొచ్చింది అనేలా కామెంట్స్ వస్తున్నాయి. దర్శకుడు రాజ్ నిడిమోరుతో వివాహం తర్వాత ఆమె చేసిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం సోలో కెరీర్ లోనే మంచి వసూళ్లను సాధించింది. వ్యక్తిగత జీవితంలో కొత్త రూట్ ఎంచుకున్న ప్రతిసారీ ఆమె కంటెంట్ ఓరియెంటెడ్ కథలతో సరికొత్త ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూనే ఉంది. లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్స్ వైపు ఆమె అడుగులు వేయడం కెరీర్ కి మరింత ప్లస్ అయింది.
రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చిన ‘లెనిన్’ మూవీతో అఖిల్ అక్కినేని కూడా ఈ లిస్ట్ లో చేరిపోయాడు. జైనబ్ రావ్జీతో మ్యారేజ్ తర్వాత అఖిల్ కంప్లీట్ మాస్ మేకోవర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఓపెనింగ్స్ పరంగా ఈ చిత్రం అఖిల్ కెరీర్ లోనే సాలిడ్ నెంబర్స్ నమోదు చేయడంతో, పర్సనల్ లైఫ్ సెంటిమెంట్ ఇక్కడ కూడా రిపీట్ అయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. జీవితంలో వచ్చే కొత్త మార్పులు ఇచ్చే పాజిటివ్ ఎనర్జీతో పాటు కరెక్ట్ స్క్రిప్ట్ సెలెక్షన్ కలిసొచ్చినప్పుడే బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ రిపీట్ అవుతుంది. ఇక రాబోయే రోజుల్లో ఈ హీరోలు ఎలాంటి హిట్స్ కొడతారో చూడాలి.
This post was last modified on July 13, 2026 10:59 am
టాలీవుడ్లో యువ కథానాయకులు ఒక్కొక్కరుగా పెళ్లి వైపు అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో అల్లు శిరీష్ వివాహం చేసుకున్న…
భారీ ప్యాన్ ఇండియా మూవీ, ఇమేజ్ ఉన్న స్టార్ హీరో అని కథ పూర్తిగా వినకుండా, జల్లెడ పట్టకుండా తొందరపడితే…
సుప్రీం కోర్టు తీర్పుతో మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు.…
తమ స్వంత ప్రమేయం లేకుండా ఎవరి వల్లనో ఇబ్బందులు, కష్టాలు పడాల్సి వస్తే ఆ బాధ మాములుగా ఉండదు. ఇట్లు…
కెజిఎఫ్, సలార్ రూపంలో తనకంటూ కల్ట్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. తను డైరెక్ట్ చేయకపోయినా కేవలం కథను…
225 పరుగులు చేసినా న్యూజిలాండ్‌కు విజయం దక్కలేదు. టీమ్ఇండియా మరో రెండు బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‌ను ఛేదించింది. అయితే…