కొత్త ఏడాదిలో సినిమా సందడికి తెర లేవబోతోంది. సంక్రాంతికి ఐదు రోజుల ముందే మాస్ రాజా రవితేజ సినిమా క్రాక్ ప్రేక్షకుల ముందుకు రానుంది. శనివారం ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో బుధవారం రాత్రి ఈ చిత్రానికి ప్రి రిలీజ్ ఈవెంట్ చేశారు.
గత ఏడాది ఆరంభంలో భీష్మ ప్రి రిలీజ్ ఈవెంట్ తర్వాత టాలీవుడ్లో ఒక పేరున్న సినిమాకు జరిగిన బహిరంగ ప్రి రిలీజ్ ఈవెంట్ ఇదే. మధ్యలో కొన్ని సినిమాలకు వర్చువల్ ఈవెంట్లు చేశారు. కానీ పూర్వంలా ఆడిటోరియంలో ఇండస్ట్రీ ప్రముఖుల మధ్య జరిగిన ఈవెంట్ ఇదే. ఈ వేడుకకు హీరోయిన్ శ్రుతి హాసన్, సంగీత దర్శకుడు తమన్ రాలేకపోయారు. హీరో రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేనితో పాటు మిగతా యూనిట్ సభ్యులు హాజరయ్యారు.
ఈ వేడుకలో దర్శకుడు గోపీచంద్ మాట్లాడుతూ.. ట్రైలర్లో అన్నట్లు ఈ సినిమా స్యూర్ షాట్, నో డౌట్ అని చెప్పాడు. రవితేజ తనకు డాన్ శీను మూవీ ద్వారా సినిమాల్లో లైఫ్ ఇచ్చిన వ్యక్తి అని.. ఆ సినిమాతో పాటు తర్వాత తమ కాంబినేషన్లో వచ్చిన బలుపు సైతం సూపర్ హిట్టయిందని.. ఇప్పుడు క్రాక్‌తో తమది బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ అవుతుందని ధీమా వ్యక్తం చేశాడు. క్రాక్‌కు అద్భుతమైన కథ కుదిరిందని.. ఈ సినిమాలో భాగమైన వాళ్లందరూ కథ విని చాలా ఎగ్జైట్ అయ్యారని గోపీచంద్ తెలిపాడు.
ఈ సినిమా నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిందని.. రవితేజ చేసిన పోలీస్ పాత్ర, సముద్రఖని, వరలక్ష్మి శరత్ కుమార్ చేసిన విలన్ పాత్రలు.. ఇంకా మరికొన్ని క్యారెక్టర్లు నిజ జీవితం నుంచి తీసుకున్నవని.. ఆ వ్యక్తులందరూ నిజంగానే ఉన్నారని.. ఈ పాత్రలన్నీ ప్రేక్షకులకు థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయని గోపీ చెప్పాడు. సంగీత దర్శకుడు తమన్ చెన్నైలో ఫైనల్ మిక్సింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడని.. ఫ్లైట్‌లో అతడి దగ్గరికి వెళ్లాలని.. మిగతా విషయాలు సక్సెస్ మీట్లో మాట్లాడతానని చెప్పి హడావుడిగా తన ప్రసంగం ముగించి వెళ్లిపోయాడు గోపీ.
This post was last modified on January 7, 2021 11:54 am
తల్లిదండ్రులు పిల్లల్ని పొగిడితే ఆయుక్షీణం అంటారు. పవన్ కళ్యాణ్‌కు చిరంజీవి పేరుకు అన్నయ్యే కానీ.. ఆయనది తండ్రి స్థానమే. అందుకేనేమో…
నిర్మాతలు అదిగో ఇదిగో అనడమే తప్పించి ఫలానా డేటుకి రామాయణ పార్ట్ 1 రిలీజ్ అవుతుందని ఇప్పటికీ చెప్పకపోవడం మహా…
తమిళ నటుడు సూర్య పెద్ద స్టార్ హీరో అయినా.. ఏమాత్రం భేషజం లేని, ఉన్నత వ్యక్తిత్వం తనది. అభిమానులను అక్కున…
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా కబురు వచ్చేసింది. కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతున్నట్లే విలక్షణ దర్శకుడు వివేక్ ఆత్రేయ…
భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు అనుమతులు ఆలస్యమవుతున్నాయని ఎలాన్ మస్క్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారత వ్యాపారవేత్తల కారణంగానే తమ…
ఏపీ మంత్రులకు సీఎం చంద్రబాబు బిగ్ టాస్క్ విధించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ మంత్రివర్గం..…