టాలీవుడ్ సీనియర్ దర్శకుడు గుణశేఖర్ సొగసు చూడతరమా, బాల రామాయణం, చూడాలని ఉంది, ఒక్కడు లాంటి కొన్ని సెన్సేషనల్ సినిమాలు తీసినప్పటికీ ఆయన కెరీర్లో ఎక్కువగా ఫెయిల్యూర్లే కనిపిస్తాయి. ముఖ్యంగా ఒక్కడు తర్వాత ఆయన్నుంచి పూర్తి స్థాయిలో సంతృప్తినిచ్చిన సినిమా రాలేదు. రుద్రమదేవి ఉన్నంతలో బాగానే ఆడింది కానీ.. దానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. అలాగే అది కాస్ట్ ఫెయిల్యూర్‌గా నిలిచింది.
ఐతే ఈ చిత్రానికి ముందు గుణశేఖర్ ట్రాక్ రికార్డు దారుణంగా ఉన్నప్పటికీ.. రూ.60 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి భారీ స్థాయిలో సినిమాను తెరకెక్కించాడు. ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా ఆ మొత్తంలో రికవరీ చేయడం అసాధ్యమని, పెద్ద మొత్తంలో నష్టం తప్పదని అనుకన్నారంతా. కానీ ఆ సినిమా ఓ మోస్తరుగా ఆడి.. గుణశేఖర్ స్వల్ప నష్టాలతో బయటపడేలా చేసింది
ఈ చిత్రం తర్వాత భారీ బడ్జెట్లో హిరణ్య కశ్యప చేయాలనుకున్నాడు గుణ. కానీ మూడేళ్లకు పైగా ఈ ప్రాజెక్టు మీద పని చేశాక అది హోల్డ్‌లో పడిపోయింది. ప్రస్తుతానికి హీరో రానా, నిర్మాత సురేష్ బాబు వెనక్కి తగ్గారు. అదెప్పుడు పట్టాలెక్కుతుందో కానీ.. ఈలోపు శాకుంతలం అంటూ మరో మైథలాజికల్ సినిమా తీయడానికి గుణ రంగం సిద్ధం చేశాడు. ఇది ఆయన సొంత బేనర్లోనే తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని కూడా రుద్రమదేవికి దీటుగా భారీ బడ్జెట్లోనే తీయబోతున్నాడట. ప్రి ప్రొడక్షన్ వర్క్‌కే కోట్లల్లో ఖర్చు పెడుతున్నాడు గుణ. సినిమా కోసం భారీ సెట్టింగ్స్ రెడీ అవుతున్నాయి. సంబంధిత ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు గుణశేఖర్.
ఐతే రుద్రమదేవితో పెద్దగా సంపాదించిందేమీ లేదు. గత దశాబ్దంన్నరలో గుణ తీసిన ఇతర సినిమాలన్నీ తుస్సుమన్నాయి. వీటితో అతనేం సంపాదించాడో ఏమో. అయినా సరే.. రుద్రమదేవి తర్వాత మరో సాహసోపేత ప్రాజెక్టును తలకెత్తుకున్నాడు గుణ. మరి ఇంత భారీ సినిమాలు తీయడానికి గుణ ఎలా సమకూర్చుకుంటున్నాడో అని ఇండస్ట్రీ జనాలు చర్చించుకుంటున్నారు. అతణ్ని నమ్మి ఫైనాన్షియర్లు ఇంతేసి డబ్బులు సమకూరుస్తున్నా గొప్ప విషయమే అనుకోవాలి.
This post was last modified on January 7, 2021 11:51 am
టాలీవుడ్ లో అసలు అపజయమే ఎరుగని దర్శకుల్లో రాజమౌళి తర్వాత చెప్పుకోవాల్సిన పేరు అనిల్ రావిపూడి. కళ్యాణ్ రామ్ పటాస్…
ప్రస్తుతం గేమ్ ఛేంజర్ తో తన కంబ్యాక్ ఇస్తానని అభిమానులను ఊరిస్తున్న దర్శకుడు శంకర్ దానికి తగ్గట్టే ట్రైలర్ ద్వారా…
కొన్నిసార్లు సినిమాల పరంగా జరిగే సంఘటనలు యాదృచ్చికమే అయినా విచిత్రంగా అనిపిస్తాయి. అలాంటిదే ఇది కూడా. జనవరి 10 విడుదల…
అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులు వృత్తి అవకాశాల కోసం ఓపీటీపై చాలా ఎక్కువగా ఆధారపడుతున్నారు. హెచ్1బీ వీసాలు పొందేందుకు ఈ…
టాలీవుడ్లో పెద్ద పెద్ద కుటుంబాలకు చెందిన వారసులకు కూడా లేని అరంగేట్రం బెల్లకొండ సాయి శ్రీనివాస్‌కు దక్కింది. బెల్లంకొండ సురేష్…
మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ బీజేపీ నేతల మధ్య మాటల…