జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు రాష్ట్రాల కన్నా దాని గురించి తమిళనాడులో ఎక్కువ చర్చ జరగడం సోషల్ మీడియాలో చూస్తున్నాం. మురుగన్ / కుమారస్వామి మా దేవుళ్ళు అంటూ కోలీవుడ్ ఫాలోయర్స్, ట్విట్టర్ హ్యాండిల్స్ దీన్నో ఉద్యమంలా డిబేట్లు పెట్టారు. మాజీ మంత్రి ఒక అడుగు ముందుకేసి ఏకంగా సినిమాని రద్దు చేయాలని డిమాండ్ చేయడం వింత అనిపించింది.
ఇదిలా నడుస్తుండగానే ధనుష్ ఊహించని షాక్ ఇచ్చాడు. వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందే మూవీకి తమిళ్ మురుగన్ టైటిల్ పెట్టేసి ఒక ఏఐ వీడియో టీజర్ తయారు చేయించి ఆఘమేఘాల మీద అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేసారు. ఈ కలయికలో వడ చెన్నై సీక్వెల్ ఉంటుందని కొన్ని నెలలుగా వార్తలు వస్తుండగా ఇప్పుడు హఠాత్తుగా ప్రకటన రావడం చూసి చెన్నై వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. ఎందుకంటే ఈ బ్యాక్ డ్రాప్ లో ఎవరూ ఊహించని కలయిక ఇది.
కథ పరంగా తారక్ త్రివిక్రమ్ మూవీకి తమిళ మురుగన్ కి సంబంధం లేకపోవచ్చు. కానీ దేవుడికి సంబంధించిన ఎలిమెంట్ ఒకటే కాబట్టి ఖచ్చితంగా పోలిక వస్తుంది. కాకపోతే వీటిలో ధనుష్ సినిమానే ముందు రిలీజ్ అవుతుంది. ఎందుకంటే డ్రాగన్ రెండు భాగాలు రిలీజయ్యేలోపు 2028 వచ్చేస్తుంది. ఆదర్శ కుటుంబం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మూవీ ప్రీ ప్రొడక్షన్ కోసం త్రివిక్రమ్ కొంత సమయం తీసుకోబోతున్నారు. సో రెగ్యులర్ షూటింగ్ వచ్చే సంవత్సరం నుంచి ఉంటుంది.
ఇప్పుడీ ట్విస్టు తాలూకు పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి. నిర్మాత నాగవంశీ తన ట్వీట్ లో మురుగన్ ఉత్తరాదిలో పుట్టారని ప్రస్తావించడం నుంచి ఇప్పుడీ అనౌన్స్ మెంట్ దాకా సినిమా తరహాలో మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం శింబుతో అరసన్ పూర్తి చేసే పనిలో ఉన్న వెట్రిమారన్ మాములుగా అయితే వేగంగా సినిమాలు తీసే రకం కాదు. కానీ తమిళ మురుగన్ మాత్రం వీలైనంత త్వరగా పూర్తి చేసి ఇంకో ఏడాదిలో రిలీజ్ చేయాలనే టార్గెట్ పెట్టుకున్నారట.
Gulte Telugu Telugu Political and Movie News Updates