Movie News

పిల్ల జమీందార్ దర్శకుడిపై చీటింగ్ కేసు

నేచురల్ స్టార్ నాని కెరీర్ ఆరంభంలో పెద్ద హిట్ అయిన చిత్రాల్లో ‘పిల్ల జమీందార్’ ఒకటి. ఈ చిత్రంతోనే అశోక్ బాబు గుడ్లూరి దర్శకుడిగా పరిచయమై మంచి పేరు సంపాదించాడు. ఇప్పుడీ దర్శకుడు ఒక వివాదంలో వార్తల్లోకి వచ్చాడు. అతడిపై చీటింగ్ కేసు నమోదైంది.

ఒక కుర్రాడిని హీరోగా పరిచయం చేస్తానన్న హామీ మేరకు తన కుటుంబం నుంచి రూ.3.5 కోట్లు తీసుకున్నాడట అశోక్. చెప్పిన మాటను నెరవేర్చకపోవడంతో అతడిపై ఆ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు అశోక్ బాబును విచారిస్తున్నారు. మరి ఈ వ్యవహారంలో అశోక్ వెర్షన్ ఏంటో.. ఈ కేసు నుంచి అతనెలా బయటపడతాడో చూడాలి.

‘పిల్ల జమీందార్’ చిత్రాన్ని ఒక కొరియన్ ఫిలిం ఆధారంగా రూపొందించాడు అశోక్. ఒరిజినల్ చూస్తే.. మక్కీకి మక్కీ దించేసినట్లే అనిపిస్తుంది. దీని తర్వాత అశోక్ మీద అంచనాలు పెరిగాయి. కానీ ఆది సాయికుమార్ హీరోగా అతను తీసిన ‘సుకుమారుడు’ పెద్ద ఫ్లాప్ అయింది.

కొన్నేళ్ల గ్యాప్ తర్వాత అశోక్.. అనుష్క ప్రధాన పాత్రలో అశోక్ ‘భాగమతి’ సినిమా తీశాడు. అది బ్లాక్ బస్టర్ అయింది. కానీ ఆ తర్వాత అశోక్ కెరీర్ ఆశించినట్లుగా ముందుకు సాగలేదు. ‘భాగమతి’ని హిందీలో రీమేక్ చేస్తే అది పెద్ద డిజాస్టర్ అయింది. తర్వాత అంజలి ప్రధాన పాత్రలో ‘చిత్రాంగద’ అనే హార్ర్ మూవీ తీయగా.. అది కూడా తీవ్రంగా నిరాశపరిచింది. ఆ తర్వాత అశోక్ తెర మరుగైపోయాడు. మళ్లీ ఇన్నాళ్లకు ఈ చీటింగ్ కేసుతో వార్తల్లోకి వచ్చాడు.

This post was last modified on July 10, 2026 6:05 pm

Share

Recent Posts

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

2 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

3 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

3 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

4 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

4 hours ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

5 hours ago