Political News

ఇకపై వందేమాతరం పాడేటప్పుడు ఇవి చెయ్యకూడదు

నిత్యం పాఠ‌శాలల్లోనూ.. జాతీయ పండుగ‌ల దినాల్లోనూ అంద‌రూ క‌ల‌సి పాడుకునే జాతీయ గేయం వందేమాతరం ఇక‌, చ‌ట్ట‌బ‌ద్ధం కానుంది. దీనికి సంబంధించి తీసుకువ‌చ్చిన జాతీయ అవ‌మానాల చ‌ట్టం స‌వర‌ణ బిల్లును పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌లు ఆమోదించాయి. బుధ‌వారం లోక్‌స‌భ‌, గురువారం రాజ్య‌స‌భ ఈ బిల్లును ఆమోదించాయి. అయితే.. దీనిపై ప్ర‌తిప‌క్షాలు పెద్ద‌గా నిర‌స‌న వ్య‌క్తం చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. కేవ‌లం .. నీట్ ప‌రీక్ష‌, అనంత‌రం విద్యార్థులు చేసిన నిర‌స‌న వంటి అంశాల‌కే ప్ర‌తిప‌క్షాలు ప‌రిమితం అయ్యాయి.

బిల్లులో ఏముంది?

ది ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఇన్సల్ట్స్‌ టు నేషనల్‌ ఆనర్‌-1971 చట్టంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా సవరణలను తెచ్చింది. దీనిలో వందేమాతరం గేయాన్ని కూడా చేర్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌న‌గ‌ణ‌మ‌న‌, జాతీయ జెండా వంటివాటికే ప‌రిమిత‌మైన ఈ చ‌ట్టం.. ఇక నుంచి వందేమాత‌రానికి కూడా వ‌ర్తించ‌నుంది. ఈ గేయాన్ని అవమానించినా లేదా పాడుతున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా అడ్డు తగిలినా తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. జాతీయ గీతమైన జనగణమనకు ఉన్న చట్టపరమైన రక్షణే ఇకపై జాతీయ గేయం వందేమాతరానికీ వర్తిస్తుంది.

ఎవ‌రైనా కేసు పెట్ట‌వ‌చ్చు!

తాజా బిల్లు ప్ర‌కారం.. వందేమాత‌రం విష‌యంలో ఎవ‌రైనా కేసులు పెట్ట‌వ‌చ్చు. అంటే.. ఒక వ్య‌క్తి వందేమాత‌రం గేయాన్ని పూర్తిగా పాడ‌లేద‌ని పేర్కొంటూ.. ఎవ‌రైనా కేసు పెట్టే అవ‌కాశం ఉంది. దీనిని నిరూపించుకునే బాధ్య‌త బాధితుడిపైనే ఉంటుంది. అలాగే.. వందేమాత‌రం పూర్తి చ‌ర‌ణాల‌ను(6) పాడ‌క పోయినా.. కూడా ఈ చ‌ట్టం కింద శిక్షార్హులు అవుతారు. అక్క‌డితో కూడా ఆగ‌లేదు… ఈ బిల్లు ఆమోదం పొందితే.. వందేమాత‌రం గేయాన్ని స‌రిగా పాడ‌లేద‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చినా.. కూడా నిందితులు విచార‌ణ‌కు అర్హుల‌వుతారు.

ఏం చేయాలి?

+ తాజా బిల్లు ప్ర‌కారం.. వందేమాత‌రం పూర్తి గేయాన్ని ఆల‌పించాలి.

+ వందేమాత‌రం ఆల‌పిస్తున్న‌ప్పుడు.. వ్యంగ్య చేష్ఠ‌లు చేయ‌రాదు.

+ నిటారుగా నిల‌బ‌డి..రెండు చేతుల‌ను స‌మానంగా కిందికి పెట్టుకోవాలి.

+ వందేమాత‌రం గేయం ఆల‌పిస్తున్న‌ప్పుడు.. తోటివారితో కానీ.. ఫోన్‌ల‌లో కానీ మాట్లాడ‌డాన్ని అవ‌మానంగా భావిస్తారు. దీనికి శిక్ష త‌ప్ప‌దు.

+ వందేమాత‌రం గేయాన్ని సినిమాల్లోను.. ఇత‌ర‌త్రా ప్రైమ్ టైమ్ షోల‌లోనూ వినియోగించ‌రాదు.

+ ప్ర‌స్తుతం జ‌న‌గ‌ణ‌మ‌న గీతానికి ఉన్న అన్ని నిబంధ‌న‌లు వందేమాత‌రానికి వ‌ర్తిస్తాయి.

+ స‌ర‌దా కోసం వందేమాత‌రం ఆల‌పించ‌కూడ‌దు.

+ ఇష్టం వ‌చ్చిన ట్యూన్‌లోను.. ఫోన్ల రింగ్ టోన్‌ల రూపంలోనూ.. దీనిని వినియోగిచ‌రాదు.

+ అలా చేస్తే.. నిందితుల‌కు మూడు సంవ‌త్స‌రాల జైలు.. రూ.ల‌క్ష నుంచి 10 ల‌క్ష‌ల వ‌ర‌కు జ‌రిమానా విధిస్తారు.

This post was last modified on July 31, 2026 11:00 am

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

3 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

3 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

4 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

4 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

5 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

6 hours ago