జూలై అయిపోయింది. వేసవిలో ఎండల బాలన్స్ ఏదైనా ఉందంటే ఈ నెలతో సమాప్తం అయినట్టే. ఆల్రెడీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను కమ్మేశాయి. తెల్లవారుఝామున చలి మొదలైపోయింది. ఇక టాలీవుడ్ బాక్సాఫీస్ విషయానికి వస్తే జూన్ లో పెద్ది, మా ఇంటి బంగారం ఇచ్చిన కిక్ జూలైలో అంత పెద్ద మొత్తంలో లేకపోయినా, సక్సెస్ రేట్ పరంగా చూసుకుంటే ఏప్రిల్, మే కంటే ఈ నెల చాలా బెటర్ గా నిలిచింది. థియేటర్లకు జనాలు వచ్చేలా చేయడం కొన్ని సినిమాలు విజయవంతమయ్యాయి.
తొలి వారం నాగబంధం, రావు బహదూర్ ఎంత హడావిడి చేసినా ఫైనల్ గా ఫెయిల్యూర్స్ గానే నిలిచాయి. ప్రమోషన్ల పరంగా ఈ రెండు బృందాలు ఎంత చేయాలో అంతా చేశాయి కానీ తుది ఫలితం పాజిటివ్ గా రాలేదు. అయితే లెనిన్ రూపంలో పెద్ద ఊరట దక్కింది. అఖిల్ కు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేలా ఫస్ట్ వీక్ వసూళ్లు చాలా బాగా వచ్చాయి. మౌత్ టాక్ సానుకూలంగా ఉండటంతో కలెక్షన్లు భారీగా రాబట్టింది. నిర్మాత వంద కోట్ల పోస్టర్ వేశారు కానీ దాని లోగుట్టు పెరుమాళ్ళకెరుక.
తర్వాత ఓ సుకుమారి లాంటి చిన్న సినిమాలు కనీస స్థాయిలో మెప్పించలేక సెలవు తీసుకోగా మూడో వారంలో వచ్చిన చెన్నై లవ్ స్టోరీ తిరిగి ఆక్సీజెన్ అందించింది. మరీ కళ్ళు చెదిరే రికార్డులు వచ్చాయని కాదు కానీ ప్రీమియర్ షోల నుంచి మిక్స్డ్ టాక్ కోణంలో చూసుకుంటే అనూహ్యంగా రిజల్ట్ మారిపోయి ఆడియన్స్ నుంచి మద్దతు దక్కడం విశేషం. యాభై కోట్లను టార్గెట్ గా పెట్టుకున్న చెన్నై లవ్ స్టోరీకి రెండో వీకెండ్ చాలా అంటే చాలా కీలకం కానుంది.
విజయ్ జన నాయకుడిని మనోళ్ళు పిచ్చ లైట్ తీసుకున్నారు. జయకృష్ణని ఘట్టమనేనిని పరిచయం చేస్తూ తీసిన శ్రీనివాస మంగాపురం ఏదో అద్భుతం చేసే ఛాన్స్ అంతగా లేదు కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ కనక మాస్ ని ఓ మాదిరిగా మెప్పించినా ఎంతో కొంత రాబట్టొచ్చు. అయితే ఎగ్జిబిటర్లను ఫుల్ హ్యాపీ చేసింది మాత్రం స్పైడర్ మ్యాన్ ది బ్రాండ్ న్యూ డేనే. మొదటి రోజు ఎక్కడ చూసినా జనాలతో హాళ్లు కళకళలాడాయి. ఆగస్ట్ లో క్రేజీ రిలీజులు ఉన్న నేపథ్యంలో జూలై దానికి మంచి పునాది వేసింది.
This post was last modified on July 31, 2026 11:45 am
టార్గెట్ కేటీఆర్.. లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న…
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…