Movie News

అఖిల్.. సమంత… ఒకరికోసం ఒకరు

సినీ ఇండస్ట్రీలో స్టార్స్ పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నా సరే.. ఒకరి ప్రొఫెషన్ ను మరొకరు గౌరవించుకోవడం ఎప్పుడూ పాజిటివ్ ఫీల్ ఇస్తుంది. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత కూడా అక్కినేని ఫ్యామిలీతో సమంత ఒక హెల్తీ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు అనిపిస్తోంది. రీసెంట్ గా జరిగిన విషయాలే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. అఖిల్ అక్కినేని, సమంత ఒకరి సినిమాలకు ఒకరు సపోర్ట్ చేసుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

రీసెంట్ గా సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా ట్రైలర్ పై అఖిల్ ఇంట్రెస్టింగ్ గా స్పందించారు. తాను ఇంకా ఆ సినిమా చూడనప్పటికీ, ట్రైలర్ లోని వైబ్ తనకు బాగా నచ్చిందని చెబుతూ సమంతతో పాటు చిత్ర యూనిట్ కు ఆయన కంగ్రాట్స్ చెప్పారు. సినిమాపై అఖిల్ ఈ రేంజ్ లో పాజిటివ్ కామెంట్స్ చేయడం నెటిజన్లను బాగా అట్రాక్ట్ చేసింది.

అఖిల్ ఇచ్చిన ఈ సపోర్ట్ కు సమంత కూడా అంతే పద్ధతిగా రియాక్ట్ అయింది. అఖిల్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ థియేటర్లలోకి వచ్చిన రోజే ఆమె తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో మూవీ టీమ్ కు బెస్ట్ విషెస్ చెప్పింది. ఈ సినిమా ట్రైలర్ ను షేర్ చేస్తూ.. అఖిల్ కు, చిత్ర యూనిట్ కు ఆల్ ది బెస్ట్.. అప్పుడే బ్లాక్‌బస్టర్ వైబ్స్ కనిపిస్తున్నాయంటూ ఒక స్పెషల్ నోట్ రాసుకొచ్చింది.

ఎవరూ ఊహించని ఈ సపోర్ట్ అటు అక్కినేని అభిమానులతో పాటు ఇటు సమంత ఫ్యాన్స్ కు కూడా భలే కిక్ ఇస్తోంది. గతంలో ఏం జరిగినా సరే, కెరీర్ పరంగా ఒకరినొకరు ఇలా ఎంకరేజ్ చేసుకోవడం వాళ్ళ మెచ్యూరిటీని చూపిస్తోంది. సోషల్ మీడియా వేదికగా జరిగిన ఈ స్వీట్ ఇంటరాక్షన్ ప్రస్తుతం నెట్టింట ఫుల్ పాజిటివ్ వైబ్స్ తో ట్రెండ్ అవుతోంది. ఇక అఖిల్ లెనిన్ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. పాజిటివ్ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి. మరి కోరుకున్న బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ ఏ స్థాయిలో ఉంటాయో చూడాలి.

This post was last modified on July 10, 2026 4:36 pm

Share

Recent Posts

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

59 minutes ago

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

4 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

5 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

5 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

7 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

7 hours ago