నేచురల్ స్టార్ నాని కెరీర్ ఆరంభంలో పెద్ద హిట్ అయిన చిత్రాల్లో ‘పిల్ల జమీందార్’ ఒకటి. ఈ చిత్రంతోనే అశోక్ బాబు గుడ్లూరి దర్శకుడిగా పరిచయమై మంచి పేరు సంపాదించాడు. ఇప్పుడీ దర్శకుడు ఒక వివాదంలో వార్తల్లోకి వచ్చాడు. అతడిపై చీటింగ్ కేసు నమోదైంది.
ఒక కుర్రాడిని హీరోగా పరిచయం చేస్తానన్న హామీ మేరకు తన కుటుంబం నుంచి రూ.3.5 కోట్లు తీసుకున్నాడట అశోక్. చెప్పిన మాటను నెరవేర్చకపోవడంతో అతడిపై ఆ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు అశోక్ బాబును విచారిస్తున్నారు. మరి ఈ వ్యవహారంలో అశోక్ వెర్షన్ ఏంటో.. ఈ కేసు నుంచి అతనెలా బయటపడతాడో చూడాలి.
‘పిల్ల జమీందార్’ చిత్రాన్ని ఒక కొరియన్ ఫిలిం ఆధారంగా రూపొందించాడు అశోక్. ఒరిజినల్ చూస్తే.. మక్కీకి మక్కీ దించేసినట్లే అనిపిస్తుంది. దీని తర్వాత అశోక్ మీద అంచనాలు పెరిగాయి. కానీ ఆది సాయికుమార్ హీరోగా అతను తీసిన ‘సుకుమారుడు’ పెద్ద ఫ్లాప్ అయింది.
కొన్నేళ్ల గ్యాప్ తర్వాత అశోక్.. అనుష్క ప్రధాన పాత్రలో అశోక్ ‘భాగమతి’ సినిమా తీశాడు. అది బ్లాక్ బస్టర్ అయింది. కానీ ఆ తర్వాత అశోక్ కెరీర్ ఆశించినట్లుగా ముందుకు సాగలేదు. ‘భాగమతి’ని హిందీలో రీమేక్ చేస్తే అది పెద్ద డిజాస్టర్ అయింది. తర్వాత అంజలి ప్రధాన పాత్రలో ‘చిత్రాంగద’ అనే హార్ర్ మూవీ తీయగా.. అది కూడా తీవ్రంగా నిరాశపరిచింది. ఆ తర్వాత అశోక్ తెర మరుగైపోయాడు. మళ్లీ ఇన్నాళ్లకు ఈ చీటింగ్ కేసుతో వార్తల్లోకి వచ్చాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates