Movie News

ఎంజిఆర్ ఎన్టీఆర్ తర్వాత విజయ్ అందుకున్నాడు

ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ కొత్త సినిమా రిలీజ్ కావడం అనేది చరిత్రలో చాలా అరుదుగా జరుగుతుంది. ఆ ఘనత ఇప్పటిదాకా ఇద్దరు అందుకున్నారు. ఎంజిఆర్ తమిళనాడు సిఎం అయ్యాక అప్పటికే ఆయన నటించి పూర్తి చేసిన రెండు చిత్రాలు థియేటర్లకు వచ్చాయి. ఆ తర్వాత నటనకు దూరమయ్యారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ సిఎంగా ఉన్నప్పుడే బ్రహ్మర్షి విశ్వామిత్ర చేయడం అప్పట్లో పెద్ద సంచలనం. తర్వాత ఇంకో మూడు సినిమాల్లో నటించారు.

వీళ్ళ సరసన విజయ్ చేరబోతున్నారు. జన నాయకుడు రిలీజ్ కు రూట్ క్లియర్ అయ్యింది. సెన్సార్ ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. జూలై 24 విడుదలకు ఎలాంటి అడ్డంకులు లేనట్టే. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం వెళ్ళిపోయింది. ఇక్కడ కూడా రేపో ఎల్లుండో అనౌన్స్ మెంట్ ఇస్తారు. జనవరిలో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ ఆరు నెలలుగా సెన్సార్ ఆఫీస్ లోనే మగ్గుతోంది. నిర్మాత చేసిన విశ్వప్రయత్నాలు ఆఖరికి ఇప్పుడు కొలిక్కి వచ్చాయి.

జన నాయకుడుని పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకోవాలని ఎదురు చూసిన అభిమానులకు ఏ సర్టిఫికెట్ అడ్డంకిగా మారుతుంది. ఎందుకంటే అధికార టీవీకే పార్టీ దీని స్పెషల్ షోలను పిల్లలకు వేయాలని ప్లాన్ చేస్తున్నారట. కానీ సెన్సార్ వల్ల అది సాధ్యం కాదు. ఒకవేళ ఏం పర్లేదని స్క్రీనింగ్ చేస్తే పోలీస్ కేసు అవుతుంది. అసలే విజయ్ చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. బ్లాక్ టికెట్లు అధిక ధరలు లేకుండా చూసుకోమని పంపిణీదారులు ముందే చెప్పారట.

భగవంత్ కేసరి రీమేక్ గా రూపొందిన జన నాయకుడులో సెకండాఫ్ ని సమూలంగా మార్చేశారు. మమిత బైజు పోషించిన శ్రీలీల ఎపిసోడ్ మాత్రమే అలా ఉంచేసి విలన్ ట్రాక్, ఫ్లాష్ బ్యాక్. యాక్షన్ బ్లాక్స్ వగైరాలన్నీ ఎక్కడా పోలిక రాకుండా చేంజ్ చేశారు. క్లైమాక్స్ ఏకంగా రజనీకాంత్ రోబో రేంజ్ లో ఉంటుందని టాక్. వీటిని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. తెలుగు రాష్ట్రాల్లో చెప్పలేం కానీ తమిళనాడు, ఓవర్సీస్ లో మాత్రం వసూళ్ల మోత మోగడం ఖాయం. టాక్ ఎలా వచ్చినా జరిగేలా ఉంది.

This post was last modified on July 9, 2026 11:13 pm

Share

Recent Posts

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

2 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

4 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

5 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

5 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

6 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

7 hours ago