సంక్రాంతికి విడుదలైన అనగనగా ఒక రాజు వచ్చి ఆరు నెలలు దాటేసింది. ఇప్పటిదాకా నవీన్ పోలిశెట్టి కొత్త సినిమా అనౌన్స్ మెంట్ రాలేదు. అర్ధ సంవత్సరం అయ్యాక కూడా నెమ్మదిగా ఉండటం పట్ల ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా నవీన్ మాత్రం ఎప్పటిలాగే నిదానమే ప్రధానం సూత్రాన్ని పాటిస్తున్నాడు. కథలు చెప్పే దర్శక రచయితలు ఎంత మంది వస్తున్నా ఆచితూచి అడుగులు వేస్తున్న రాజుగారు ఫైనల్ గా ఒక తమిళ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్త జోరుగా తిరుగుతోంది.
అతని పేరు ఆంటోనీ భాగ్యరాజ్. ఆ మధ్య సైరన్ అనే సినిమా తీశాడు. జయం రవి, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ మొదలైనవాళ్లతో క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చింది. తెలుగులో ఎవరూ పట్టించుకోలేదు కానీ తమిళంలో కూడా అంచనాలు అందుకోలేక ఫ్లాపయ్యింది. ఇతను చెప్పిన లైన్ మైత్రి మేకర్స్ కు బాగా నచ్చడంతో వాళ్ళ ద్వారా నవీన్ పోలిశెట్టి దాకా వెళ్లి ఓకే చేయించుకుందని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
ఎంత గ్యాప్ తీసుకోవాలనేది హీరోల ఇష్టమే కానీ నవీన్ పోలిశెట్టి లాంటి వాళ్ళు కూడా ఇంతేసి నెలలు ఖాళీగా ఉండిపోవడం మంచి సంకేతం కాదు. మార్కెట్ లో ఇమేజ్ ఉంది. యువతలో ఫ్యామిలీస్ లో ఫాలోయింగ్ వచ్చింది. అంతమాత్రాన మరీ స్లో అండ్ స్టడీ ఉండటం కరెక్ట్ కాదు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత కూడా నవీన్ చెప్పుకోదగ్గ బ్రేక్ తీసుకున్నాడు. మధ్యలో చిన్న ప్రమాదం జరిగి అది మరింత ఆలస్యానికి దారి తీసింది. కానీ ఇప్పుడలాంటి సమస్యలు లేవు.
మొత్తంగా టాలీవుడ్ లో రేంజ్ తో సంబంధం లేకుండా ఎవరూ వేగంగా సినిమాలు తీసే పరిస్థితిలో లేరు. రవితేజ, శ్రీవిష్ణు లాంటి ఒకరిద్దరిని మినహాయిస్తే అందరిదీ ఇదే దారి. ఇప్పుడు నవీన్ పోలిశెట్టి కూడా టైం టేకింగ్ జోన్ లోకి వెళ్ళిపోతున్నాడు. కాకపోతే షూటింగులు మరీ ఆలస్యం కాకుండా వేగంగా పూర్తి కావడం వల్ల రిలీజులు సకాలంలో ఉంటున్నాయి. మరి ఇప్పుడు ఓకే చేసింది ఏ సీజన్ లో విడుదలవుతుందో అధికారిక ప్రకటన ఇచ్చాక క్లారిటీ వస్తుంది.
ఆగస్ట్ 26 విడుదల కాబోతున్న టాక్సిక్ ప్రమోషన్ల స్పీడ్ పెంచుతున్నారు. బజ్ పెరగాలంటే కంటెంట్ రెగ్యులర్ గా వస్తూ ఉండాలి.…
తమిళంలో టాప్ లీగ్ కథానాయకులకు చాలా దగ్గరగా వెళ్లిన మిడ్ రేంజ్ హీరోల్లో రవి మోహన్ అలియాస్ జయం రవి…
దక్షిణాది సినీ చరిత్రలోనే అతి పెద్ద సంచలనాల్లో ‘కాంతార’ ఒకటి. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్లో ప్రాంతీయ భాషా చిత్రంగా…
గత నెల విడుదలై ఇప్పటికీ డీసెంట్ రన్ కొనగిస్తున్న 'మా ఇంటి బంగారం' వంద కోట్ల మార్కుని ఏ క్షణమైనా…
ఇంగ్లాండ్ టీ20 టూర్‌లో టీమిండియా ఆడుతున్న తీరు చూస్తుంటే ఫ్యాన్స్ కి మైండ్ బ్లాక్ అవుతోంది. ట్రెంట్ బ్రిడ్జ్ లో…
తమిళనాడు సీఎం విజయ్ జన నాయకుడు సినిమా విషయంలో జరుగుతున్న పరిణామాలు తెరమీద డ్రామా కన్నా గొప్పగా పండుతున్నాయి. మొన్నెవరో…