పడ్డ కష్టంతో సంబంధం లేకుండా ఒక్కోసారి విజయాలు, అపజయాలు వచ్చే పరిశ్రమ కావడం వల్ల సినిమా వాళ్లకు సెంటిమెంట్లు జాస్తి. ఒక్కోసారి కథ, దర్శకుడి కంటే కూడా ముహూర్తం, సెంటిమెంటునే బలంగా నమ్ముతుంటారు. వినడానికి కామెడీగా వున్నా కానీ ఫలానా హీరోలకు ఫలానా సీజన్ కలిసి రావడం, ఆ టైమ్‍లో ఎక్కువ హిట్లు పడడం కేవలం యాధృశ్చికమని తీసి పారేయలేం.
ప్రస్తుతం ఫ్లాప్ తేజగా మారిపోయిన మాస్ మహారాజా రవితేజ ఈ శనివారం విడుదల కానున్న ‘క్రాక్’ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నాడు. సంక్రాంతికి రవితేజ ట్రాక్ రికార్డ్ బాగుండడం కూడా ఈసారి అతను హిట్టిస్తాడనే కాన్ఫిడెన్స్ పెంచుతోంది. కృష్ణ, మిరపకాయ్ లాంటి హిట్లు రవితేజ సంక్రాంతికే కొట్టాడు. ఈ అబ్బాయి చాలా మంచోడు, శంభో శివ శంభో కూడా సంక్రాంతి రిలీజులే. అవి పెద్ద హిట్ కాకపోయినా రవితేజకు పేరు తెచ్చి పెట్టాయి. సెంటిమెంట్ పరంగా రవితేజకు కలిసి వచ్చే సీజన్ కనుక ఈసారి క్రాక్‍తో ‘భూమ్ బద్దల్’ అవడం ఖాయమని దర్శకుడు గోపిచంద్ మలినేనితో పాటు నిర్మాత కూడా నమ్మకం పెట్టుకున్నారు.
This post was last modified on January 7, 2021 12:53 am
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…