Movie News

రామాయ‌ణ పై ముందే చేతులెత్తేసిన కాజ‌ల్

స్టార్ హీరోయిన్లు ఏదైనా రామాయణ లాంటి పెద్ద సినిమాలో న‌టించిన‌పుడు వారి ఇమేజ్‌కు త‌గ్గ పాత్ర‌లు లేక‌పోతే.. అభిమానులు ఫీల‌వ‌డం స‌హ‌జం. పాత్ర స్క్రీన్ టైం త‌క్కువ ఉన్నా, ఆ క్యారెక్ట‌ర్‌కు ప్రాధాన్యం లేక‌పోయినా.. అభిమానులు నిరాశ చెంద‌డంతో పాటు సోష‌ల్ మీడియాలో, మీడియాలో నెగెటివ్ కామెంట్లు ప‌డిపోతాయి. ఐతే కొన్నిసార్లు మేకింగ్ టైంలో ప్రాధాన్యం ఉన్న‌ట్లు క‌నిపించినా.. ఎడిటింగ్‌లో కొన్ని స‌న్నివేశాల‌కు కోత ప‌డిపోవ‌డం వ‌ల్ల పాత్ర‌ల ప్రాధాన్యం త‌గ్గిపోతుంటుంది.

కొన్నిసార్లు మేకింగ్ టైంలోనే త‌మ పాత్ర‌ల‌కు ఆశించిన ప్రాధాన్యం లేద‌ని ఆర్టిస్టుల‌కు అర్థ‌మైపోతుంటుంది. అలాంట‌పుడు అభిమానుల‌ను ముందే ప్రిపేర్ చేయ‌డం మంచిదే. కాజ‌ల్ అగ‌ర్వాల్ ఈ పనే చేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఆమె ఇండియాస్ హైయెస్ట్ బ‌డ్జెట్ ఫిలిం రామాయ‌ణ‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ చిత్రంలో రావ‌ణుడిగా న‌టిస్తున్న య‌శ్‌కు జోడీగా మండోద‌రి పాత్ర‌లో క‌నిపించ‌నుంది కాజ‌ల్. మామూలుగా రామాయ‌ణం క‌థ‌ను ప‌రిశీలించినా.. దాని మీద వ‌చ్చిన సినిమాల‌ను గ‌మ‌నించినా.. మండోద‌రి పాత్ర‌కు పెద్ద‌గా ప్రాధాన్యం క‌నిపించ‌దు. కొత్త రామాయ‌ణం కూడా ఇందుకు భిన్నంగా ఏమీ ఉండ‌ద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

కాజ‌ల్ స్వ‌యంగా త‌న పాత్ర చిన్న‌దే అంటూ ముందే హింట్ ఇచ్చేసింది. రామాయ‌ణం రెండు భాగాలుగా తెర‌కెక్కుతుండ‌గా.. ప్ర‌స్తుతం ఒక భాగం షూటింగ్ మాత్రమే పూర్త‌యింద‌ని, లంక‌లో వ‌చ్చే స‌న్నివేశాలే త‌క్కువ అని, త‌న పాత్ర నిడివి త‌క్కువ‌గా ఉంటుంద‌ని కాజ‌ల్ వెల్లడించింది.
త‌న పాత్ర చిన్న‌దే అయినా.. ఇలాంటి మెగా ప్రాజెక్టులో భాగం కావ‌డ‌మే అదృష్ట‌మ‌ని కాజ‌ల్ వ్యాఖ్యానించింది.

య‌శ్ ఈ సినిమా కోసం ఎంతో శ్ర‌మిస్తున్నార‌ని.. త‌న‌తో స్క్రీన్ షేర్ చేసుకోవ‌డం గొప్ప అనుభ‌వ‌మ‌ని కాజ‌ల్ వ్యాఖ్యానించింది. కాజ‌ల్ ముందే హింట్ ఇచ్చేసింది కాబ‌ట్టి.. రేప్పొద్దున రామాయ‌ణంలో ఆమెది చాలా చిన్న పాత్ర అని ఫ్యాన్స్ ఫీల‌వ్వాల్సిన అస‌వ‌రం లేదు. అయినా కెరీర్లో ఈ ద‌శ‌లో కాజ‌ల్‌కు ఇలాంటి ప్రాజెక్టులో చిన్న పాత్ర అయినా ద‌క్క‌డం గొప్పే అనుకోవాలి.

This post was last modified on July 6, 2026 9:05 am

Share

Recent Posts

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

20 minutes ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

32 minutes ago

టీడీపీకి 58 కోట్లు.. వైసీపీకి 24 కోట్లు.. బీఆర్ ఎస్‌కు 16 కోట్లు..

భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…

2 hours ago

కార్తీ రేంజు ఇంత పడిపోయిందా

యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…

4 hours ago

జడల్ జమానాకు ఇంకో కీలక ఛాన్స్

నైజాంలో డీసెంట్ గా నెట్టుకొస్తున్న ప్యారడైజ్ రెండో వారంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆంధ్ర, సీడెడ్ సైడ్ బాగా నెమ్మదించిపోవడం…

4 hours ago

ఖైరతాబాద్ నుంచి జనసేన పోటీ

ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…

5 hours ago