ప్రభాస్ నుంచి రాబోతున్న కొత్త సినిమా ‘సలార్’ అనౌన్స్‌మెంట్‌తోనే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొనేలా చేసింది. ఎందుకంటే ‘కేజీఎఫ్’తో సంచలనం రేపిన ప్రశాంత్ నీల్ దీనికి దర్శకుడు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, క్యాప్షన్.. ఇలా అన్నీ కూడా ప్రభాస్ అభిమానులకు, మాస్‌కు పూనకాలు తెప్పించేలా ఉన్నాయి. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ అత్యంత వేగంగా చేయబోతున్న సినిమా ఇది. ఈ నెలాఖర్లోనే సినిమాను మొదులపెట్టి ఆరు నెలల్లో పూర్తి చేయాలన్నది ప్రభాస్ ప్రణాళిక. ‘సలార్’ ఈ ఏడాదే విడుదలైపోయినా ఆశ్చర్యం లేదు.
‘బాహుబలి’ నుంచి ప్రభాస్ సినిమాలన్నింటి లాగే ఇదీ పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కబోతోంది. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ అనగానే ఇక సౌత్ ఇండియాలో ఆటోమేటిగ్గా క్రేజ్ వచ్చేసినట్లే. బాలీవుడ్లో ఈ సినిమాను మరింతగా మార్కెట్ చేయడం కోసం ప్రధాన పాత్రలకు అక్కడి నటులనే తీసుకునే ప్రయత్నంలో ఉన్నాడు ప్రశాంత్.
ఇప్పటికే ‘సలార్’ కోసం కథానాయికగా బాలీవుడ్ భామ దిశా పటానిని ఎంపిక చేసినట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ హాట్ భామ.. ఇలాంటి యాక్షన్ మూవీకి పర్ఫెక్ట్ అని, ప్రభాస్‌తో ఆమెకు జోడీ కూడా బాగుంటుందని అంటున్నారు. కాగా ఇప్పుడు ‘సలార్’ కోసం విలన్ని కూడా ఓకే చేసినట్లు వార్తలొస్తున్నాయి. బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహాం.. ఈ చిత్రంలో ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్నాడట. ప్రభాస్‌ను మ్యాచ్ చేయాలంటే ఎదురుగా అతడి లాంటి మ్యాచో స్టార్ ఉంటేనే బాగుంటుంది. జాన్ అబ్రహాం అందుకు పర్ఫెక్ట్ అనడంలో సందేహం లేదు.
‘ఆదిపురుష్’లో ప్రభాస్‌కు విలన్‌గా సైఫ్ అలీఖాన్‌ను ఎంపిక చేయడంపై అభిమానుల్లో అసంతృప్తి వ్యక్తమైంది కానీ.. ‘సలార్’ కోసం జాన్ ఓకే అయితే మాత్రం అలాంటి ఫీలింగ్ కలగకపోవచ్చు. అతను ఇప్పటికే ‘పఠాన్’లో షారుఖ్ ఖాన్‌కు విలన్‌గా నటిస్తుండటం విశేషం. ఇదే సమయంలో ‘సలార్’కు కూడా విలన్‌గా ఓకే అయితే ఈ సినిమాకు క్రేజ్ పెరుగుతుందనడంలో సందేహం లేదు.
This post was last modified on January 6, 2021 5:08 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…