లాక్ డౌన్ టైంలో దక్షిణాది సినీ పరిశ్రమలో బాగా చర్చనీయాంశం అయిన పేరు.. వనిత విజయ్ కుమార్. దివంగత నటి మంజుల, సీనియర్ నటుడు విజయ్‌కుమార్‌ల తనయురాలైన ఈమె.. తెలుగులో దేవి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆమెకు ఇప్పటికే మూడుసార్లు పెళ్లయింది. మూడు బంధాలు చెడిపోయాయి. చివరగా లాక్ డౌన్ టైంలో పీటర్ అనే ఫిలిం మేకర్‌ను ఆమె పెళ్లి చేసుకోవడం.. దీనిపై పీటర్ భార్య గొడవ చేయడం.. పీటర్‌కు, వనితకు మధ్య కొన్ని రోజులకే విభేదాలు తలెత్తడం తెలిసిన సంగతే.
ఐతే ఈ పెళ్లిపై ఇప్పటిదాకా ఓపెన్‌గా మాట్లాడని వనిత.. ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు పీటర్‌తో జరిగింది పెళ్లే కాదని అన్న ఆమె.. తన వైవాహిక జీవితం సరిగా సాగకపోవడానికి తల్లిదండ్రులదే బాధ్యత అని విమర్శించడం గమనార్హం. ఇంకా ఈ విషయమై ఆమె ఏమందంటే..
దక్షిణాది సినీ రంగంలో దిగ్గజాలైన రజినీకాంత్, చిరంజీవి లాంటి వాళ్లు తమ కూతుళ్ల సంతోషాన్ని దృష్టిలో పెట్టుకుని మంచివాళ్లను చూసి మళ్లీ పెళ్లి చేశారని.. కానీ తన తల్లిదండ్రులు అలా చేయలేదని వనిత ఈ ఇంటర్వ్యూలో ఆరోపించింది. చిన్న వయసులోనే తనకు పెళ్లి చేసి చేతులు దులిపేసుకున్నారని.. తన ఇబ్బందులను వాళ్లు అర్థం చేసుకోలేదని.. భర్తతో తనకు గొడవలు వచ్చి విడిపోయినా.. పరువు కోసం మళ్లీ తనను అతడి దగ్గరికే పంపించేవారని.. ఇలా చాలా సార్లు జరిగిందని వనిత వాపోయింది.
రజినీకాంత్, చిరంజీవిలాగా అర్థం చేసుకుని ఉంటే.. ఈ రోజు తన లైఫ్ మరోలా ఉండేదని ఆమె అంది. తాను జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని.. ఈ మధ్య తాను పెళ్లి విషయంలో పెద్ద రాంగ్ స్టెప్ వేశానని.. అది అసలు పెళ్లే కాదని ఆమె వ్యాఖ్యానించింది. వనిత.. ప్రస్తుతం పీటర్‌కు దూరంగానే ఉంటున్నట్లు తెలుస్తోంది. ఆస్తి వివాదంల విషయమై ఒక సందర్భంలో తండ్రి విజయ్ కుమార్‌ను రోడ్డు మీదికి లాగి ఆమె గొడవకు దిగడం అప్పట్లో చర్చనీయాంశమైంది.
This post was last modified on January 6, 2021 10:12 am
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…