20 నిమిషాల కోసం రాజమౌళి పెర్ఫెక్షన్ ఇది

రాజమౌళి వారణాసి సినిమాలో రామాయణం బ్యాక్ డ్రాప్ కి సంబంధించిన ఎపిసోడ్ పైనే అందరి ఫోకస్ ఎక్కువగా ఉంది. అయితే ఈ ఎపిసోడ్ మేకింగ్ వెనుక ఉన్న టెక్నికల్ కష్టం గురించి మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. ఆయన చెప్పిన డీటెయిల్స్ చూస్తుంటే ఈ సినిమా కోసం మేకర్స్ ఏ రేంజ్ లో కష్టపడుతున్నారో అర్థమవుతోంది.

మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ అనేది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదని పృథ్వీరాజ్ వివరించాడు. కేవలం 20 నిమిషాల సీక్వెన్స్ కోసం ఏకంగా మూడు నెలల పాటు షూట్ చేయడం అంటే రాజమౌళి పెర్ఫెక్షన్ స్థాయి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి రావచ్చు కానీ, ప్రస్తుతానికి వారణాసి లాంటి భారీ ప్రాజెక్టులకు మాత్రమే ఇది సాధ్యమవుతుందని అతను క్లారిటీ ఇచ్చాడు.

షూట్ మొదలవ్వడానికి ముందే డైరెక్టర్ రాజమౌళి, అలాగే పృథ్వీరాజ్ ఇద్దరూ మోషన్ క్యాప్చర్ సూట్లు ధరించి ఫ్లోర్ లోకి దిగారట. బాడీకి సెన్సార్లు, తలకి హెల్మెట్ కెమెరా పెట్టుకుని వరుసగా మూడు రోజుల పాటు ఆ సీన్ ఎలా రావాలి అనే దానిపై ప్రాక్టికల్ గా వర్క్ చేశారని తెలిపారు. ఆ సమయంలోనే రాజమౌళి చాలా టెక్నికల్ విషయాలను సెట్ చేశారని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చాడు.

ఇంత ఖరీదైన టెక్నాలజీని నేర్చుకోవాలంటే ఎన్నో కోట్లు ఖర్చవుతుందని, కానీ రాజమౌళి లాంటి టెక్నికల్ జీనియస్ దగ్గర తనకు ఇదొక ఫ్రీ మాస్టర్ క్లాస్ లాగా ఉపయోగపడిందని ఆయన సంతోషం వ్యక్తం చేశాడు. తాను ఎంతో అదృష్టవంతుడిని అని, ఈ మూడు రోజుల అనుభవం తనకు వెలకట్టలేనిదని అన్నాడు. దీన్ని బట్టి సెట్స్ లో నటీనటులకు దర్శకుడు ఇచ్చే ఫ్రీడమ్, కాన్ఫిడెన్స్ ఎలాంటిదో క్లియర్ గా తెలుస్తోంది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇంతకుముందెన్నడూ చూడని విధంగా ఒక పౌరాణిక ఘట్టాన్ని లేటెస్ట్ వీఎఫ్ఎక్స్ తో స్క్రీన్ మీదకు తీసుకురాబోతున్నారు. మహేష్ చేసిన రుద్ర పాత్రకు కుంభ పాత్రకు మధ్య వచ్చే ఈ వార్ సీక్వెన్స్ విజువల్ గా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతోందట. ఒక సీన్ కోసం రోజుల తరబడి రిస్క్ తీసుకుంటూ మేకర్స్ పడుతున్న తపన చూస్తుంటే గ్లోబల్ మార్కెట్ ని గట్టిగానే టార్గెట్ చేసినట్లు అర్థమవుతోంది. పృథ్వీరాజ్ ఎగ్జైట్మెంట్ చూస్తుంటే, ఈ ఎపిసోడ్ థియేటర్లలో ప్రేక్షకులకు మైండ్ బ్లాంక్ అయ్యే ట్రీట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.