ఒక పాత్రకు ఒక ఆర్టిస్టు ఎంపికై.. ఆ తర్వాత ఇంకొకరి చేతికి మారడం ఫిలిం ఇండస్ట్రీలో మామూలే. చాలాసార్లు చిత్రీకరణకు ముందే ఈ మార్పు జరుగుతుంటుంది. చాలా కొన్ని సందర్భాల్లో మాత్రమే షూటింగ్ కూడా చేశాక ఆర్టిస్టులను మార్చేస్తుంటారు. అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన ‘లెనిన్’లో ఈ రెండో రకమైన మార్పే జరిగింది. ఈ చిత్రానికి కథానాయికగా శ్రీలీలను అధికారికంగా ప్రకటించడం.. ఆమె చిత్రీకరణకు కూడా హాజరు కావడం తెలిసిందే.
కానీ అనూహ్యంగా తన స్థానంలోకి భాగ్యశ్రీ బోర్సే వచ్చింది. దీనికి కారణాలేంటన్నది వెల్లడి కాలేదు. ఐతే ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. ముందు ఇందులో కథానాయిక పాత్ర భాగ్యశ్రీ దగ్గరికే వెళ్లిందట. కానీ ఏవో కారణాలతో ఆమె ఈ సినిమా ఒప్పుకోలేకపోయిందట. తర్వాత అనుకోకుండా మళ్లీ ఆ పాత్రకు తనే ఎంపికయ్యానని ఆమె మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది.
మొదట దర్శకుడు మురళీ కిషోర్ ‘లెనిన్’ కథ, అందులో భారతి పాత్ర గురించి చెప్పినపుడు తాను ఎంతో ఎగ్జైట్ అయినట్లు భాగ్యశ్రీ చెప్పింది. భారతి పాత్ర చాలా ప్రత్యేకంగా కనిపించిందని.. ప్రేమకథ చాలా సహజంగా అనిపించిందని. ఎపిక్ లవ్ స్టోరీస్‌లో ఉన్న లక్షణాలు ఇందులో ఉన్నాయని ఆమె చెప్పింది. ఐతే ఈ పాత్ర విషయంలో తాను ఎంతో ఎగ్జైట్ అయినప్పటికీ.. డేట్లు, ఇతర కారణాలతో ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చిందని.. కానీ తర్వాత మళ్లీ అనుకోకుండా ఈ సినిమా తన చేతికి వచ్చిందని ఆమె చెప్పింది.
మొత్తానికి ఒకసారి భాగ్యశ్రీని కాదనుకుని, శ్రీలీలను ఎంపిక చేశాక కూడా ఆమెను తప్పించి తిరిగి భాగ్యశ్రీనే ఈ పాత్రకు సెలక్ట్ చేశారంటే బలమైన కారణమే ఉందనుకోవాలి. ఈ మార్పు వల్ల ‘లెనిన్’ టీంకు డబ్బులతో పాటు సమయం కూడా వృథా అయింది. అయినా హీరోయిన్ని మార్చారంటే శ్రీలీల ఈ పాత్రకు సూట్ కాదని, దానికి భాగ్యశ్రీనే కరెక్ట్ అని టీం ఎంత బలంగా ఫిక్సయిందో అర్థం చేసుకోవచ్చు.
తొలి చిత్రం ‘అఖిల్’తోనే సూపర్ స్టార్ అయిపోతాడని అఖిల్ అక్కినేని మీద అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ…
కమల్ హాసన్ రీప్లేస్ చేసే స్థాయి నటుడు అంటూ ఇటీవల సత్యదేవ్ గురించి దర్వకుడు వెంకటేష్ మహా చేసిన కామెంట్…
జనసేన పార్టీ మహిళలకు ఎంత ప్రాధాన్యతనిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర లేదు. వీర మహిళలు అని సంబోధిస్తూ పార్టీలో మహిళలకు జనసేన…
తెలుగు అగ్ర నిర్మాతలు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి తమ నిర్మాణ సంస్థలను విస్తరించే పనిలో బిజీగా ఉన్నారు. ఈ…
ప్రస్తుతం రాజధాని అమరావతి ప్రాంతం అభివృద్ధిలో ముందుకు సాగాలన్నది ప్రపంచ స్థాయి నగరంగా మారాల న్నది సీఎం చంద్రబాబు ఆలోచన.…
అన్నీ అనుకున్నట్టు జరిగితే మరోసారి మెగాస్టార్ చిరంజీవి వర్సెస్ సూపర్ స్టార్ రజనీకాంత్ బాక్సాఫీస్ క్లాష్ జరిగేలా ఉంది. ఎప్పటి…