అన్నీ అనుకున్నట్టు జరిగితే మరోసారి మెగాస్టార్ చిరంజీవి వర్సెస్ సూపర్ స్టార్ రజనీకాంత్ బాక్సాఫీస్ క్లాష్ జరిగేలా ఉంది. ఎప్పటి నుంచో నిర్మాణంలో ఉంటూ విఎఫ్ ఎక్స్ వల్ల విపరీతమైన జాప్యానికి గురైన విశ్వంభరని దసరా బరిలో దింపాలని నిర్ణయించుకున్నారట. అక్టోబర్ 16 రిలీజ్ చేసేలా ఏర్పాట్లు మొదలై ఆ మేరకు డిస్ట్రిబ్యూటర్లకు ప్రాథమిక సమాచారం వెళ్లిందని ఫిలిం నగర్ టాక్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉందట. ఫైనల్ కాపీ ఆగస్ట్ చివరికి రెడీ కావొచ్చని అంటున్నారు.
జైలర్ 2 విషయానికి వస్తే చెన్నై రిపోర్ట్స్ ప్రకారం అక్టోబర్ 15 విడుదలని లాక్ చేశారట. ఇవాళ సాయంత్రం లేదా ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. బాలకృష్ణ, షారుఖ్ ఖాన్ ఇద్దరూ వేర్వేరుగా క్యామియోకి నో చెప్పాక చాలా రోజులు షూట్ పెండింగ్ లో ఉండిపోయింది. చివరికి హృతిక్ రోషన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇటీవలే చెన్నైలో ఆ ఎపిసోడ్ ని పూర్తి చేశారు. అనుకున్న దానికన్నా బాగా వచ్చిందని, ఈ కాంబో హైలైట్ అవుతుందని అంటున్నారు.
అంటే ఒక రోజు గ్యాప్ లో విశ్వంభర, జైలర్ 2 తలపడటం దాదాపు ఖాయమే. గతంలో ఇద్దరూ 2023 ఆగస్ట్ నెలలో జైలర్, భోళా శంకర్ తో పరస్పరం పోటీ పడిన సంగతి తెలిసిందే. ఫలితం మెగా ఫ్యాన్స్ అంతసులభంగా మర్చిపోలేరు. ఆ తర్వాత చిరంజీవి ఏకంగా రెండు సంవత్సరాల గ్యాప్ తో మన శంకరవరప్రసాద్ గారుతో వచ్చి హిట్టు కొట్టారు. రజనీకాంత్ లాల్ సలాం, వెట్టయన్, కూలి రూపంలో ఫ్లాపులు తగిలాయి. చివరిది కమర్షియల్ గా ఎబోవ్ యావరేజ్ అనొచ్చు.
అఫీషియల్ గా అనౌన్స్ మెంట్స్ వచ్చాక దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ వస్తుంది. విశ్వంభర విజువల్ ఎఫెక్ట్స్ ఇప్పుడు చాలా సంతృప్తికరంగా వచ్చాయని, నాగ్ అశ్విన్ పర్యవేక్షణ బాగా ఉపయోగపడిందనే టాక్ అంతర్గతంగా ఉంది. పాటలు కీరవాణి కంపోజ్ చేయగా ఒక సాంగ్ భీమ్స్, బిజిఎం గౌర హరికి ఇచ్చారని తెలిసింది. ఇక జైలర్ 2 క్రేజ్ మాములుగా లేదు. రజిని కంబ్యాక్ మళ్ళీ ఇదే అవ్వొచ్చని అంటున్నారు. చూడాలి మరి మెగాస్టార్ వర్సెస్ సూపర్ స్టార్ క్లాష్ లో ఎవరు గెలుస్తారో.
This post was last modified on July 2, 2026 3:54 pm
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…